త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగులో హీరోల స్థాయిలో అభిమానులున్న దర్శకుల్లో ఒకడు. త్రివిక్రమ్ తొలినాళ్ల గురించి మాట్లాడుతూ రచయిత కొమ్మనపల్లి గణపతిరావు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తనకు శ్రీనివాస్ గా పరిచయమైన త్రివిక్రమ్.. తనకు ఎక్కడైనా ఛాన్స్ ఇప్పించమని అడిగేవాడని గణపతిరావు తెలిపారు. ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ వి నీకు సినిమాలు ఎందుకని అప్పట్లో మందలించానని పేర్కొన్నారు. ఇక్కడ రాజకీయాలు నువు తట్టుకోలేవని చెప్పినా త్రివిక్రమ్ పట్టుదలతో వచ్చి గెలిచాడని గణపతిరావు కొనియాడారు. అప్పట్లో త్రివిక్రమ్ రాసిన ది రోడ్ కథ చూసి షాకయ్యానని గణపతిరావు చెప్పారు.