తిరుపతి-నారవారిపల్లేలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు స్థానిక మంత్రి పెద్దిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుంగనూరులో 10రోజుల్లో వందకు పైగా కేసులు పెట్టారని ఆరోపించారు.పండగ పూట మావాళ్ళు జైల్లో ఉన్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరిస్తున్నా..వచ్చే పండగకు ఎక్కడ ఉంటావో చూసుకో.అన్ని లెక్కలు రాస్తున్నా. మళ్ళీ రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయ్. ఈసారి మాత్రం మునుపటిలా క్షమించను అని హెచ్చరించారు. అంతకుముందు స్థానిక టీడీపీ నేతలతో చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.