వరుసగా రెండో సారి కూడా భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లింది. జూన్ 7న లండన్‌లో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన వారికి ఐసీసీ ‘గద’ బహూకరిస్తుంది. కాగా పర్సంటేజీ విధానంపై క్రికెట్ ప్రేమికులు విమర్శిస్తున్నారు. పర్సంటేజీ విధానంతో గందరగోళం ఉందంటున్నారు. పర్సంటేజీ విధానంతో ఎక్కువ టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌కు ప్రయోజనం లేకుండా పోయిందని.. అదే తక్కువ మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఫైనల్ బెర్తులను ప్రభావితం చేసిందని భావిస్తున్నారు.