అధికారులు లంచాలు తీసుకోవద్దంటూ వైఎస్ జగన్ మాట్లాడటం విడ్డూరమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. 14 చార్జీషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్…దోచుకున్న సొమ్మంతా ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుంచీ జగన్ దోచుకుంటున్నారని యనమల ఆరోపించారు.