తమిళ స్టార్ డైరెక్టర్‌కు యష్ గ్రీన్ సిగ్నల్ ?

Courtesy Instagram: yash

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. KGF-2 ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో తన తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. నర్తన్ అనే ఓ యువ దర్శకుడితో తరువాతి మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆ మూవీ తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ చేయనున్నట్లు గాసిప్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న శంకర్, తరువాత యష్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Exit mobile version