యశస్వి జైస్వాల్ ‘డబుల్’ ధమాకా

© ANI Photo

ధులీప్ ట్రోపీ ఫైనల్లో యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కోయంబత్తూరులో జరుగుతున్నఈ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్‌పై 244 బంతుల్లో 209 పరుగులు చేశాడు. అందులో 23 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 55, 62 పరుగుల వద్ద లైఫ్ లభించడంతో విజృంభించి ఆడాడు. మైదానం నలువైపులా స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. జైశ్వాల్ దెబ్బకు వెస్ట్ జోన్ 319 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

Exit mobile version