భారత్ జోడో యాత్రతో తనలో ఓర్పు, సహనం పెరిగాయని రాహుల్ గాంధీ వెల్లడించారు. సావధానంగా వినే సామర్థ్యం కూడా పెరిగిందని చెప్పారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన పాదయాత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకుంది. ఈ క్రమంలో 2000 కి.మీ. మైలురాయిని రాహుల్ చేరుకున్న సందర్భంగా తన అనుభూతులను వెలిబుచ్చారు. ‘యాత్రలో తోస్తున్నప్పుడు చలా నొప్పి కలిగేది. ఓసారి నడుస్తున్నప్పుడు ఓ చిన్నారి వచ్చింది. కాసేపు నాతో పాటే నడిచి ఓ లేఖను ఇచ్చి వెళ్లిపోయింది. నా పాదయాత్రకు వారంతా తోడున్నారనేది ఆ లేఖ సారాంశం’ అని రాహుల్ చెప్పారు.