వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని జులై 8, 9వ తేదీల్లో వైసీపీ పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఓ విశాలమైన ప్రాంగణంలో ఈ ప్లీనరీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి ఈ ప్లీనరీ జరుగుతుండగా.. దీనిపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.