ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభు పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నాలుగు స్థానాల్లో ఒక్కో సభ్యుడు గెలుపొందాలంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఏపీలో 150కి పైగా వైకాపా ఎమ్మెల్యేలు ఉండటంతో నాలుగు స్థానాలను కూడ ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. టీడీపీకి ఒక్కస్థానం కూడ దక్కకపోవచ్చు.