తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. నటుడు విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉందంటూ ఎంత కాలంగానే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని రష్మిక మరోసారి చెప్పింది. ‘‘విజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. న్యూ ఇయర్ రోజు నేను లైవ్‌లో ఉన్నప్పుడు వెనుక విజయ్ వాయిస్ వినిపిస్తోందని కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి మేము నవ్వుకున్నాం. విజయ్‌తో పాటు ఇంకో నలుగురి వాయిస్ కూడా ఉంది. అదెవరికీ అవసరం లేదు. మేమిద్దరం కలిసి టూర్స్‌కు వెళ్లలేదని, పార్టీలు చేసుకోలేదని ఎప్పుడూ చెప్పలేదు. ఫ్రెండ్స్ అన్నాక కలిసి టూర్స్‌కు వెళ్లడం సహజం’’ అని రష్మిక అన్నారు.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: Naga Singh