ఇటీవల తెరమరుగైన యో యో ఫిట్నెస్ టెస్టు, డెక్సా టెస్టును తిరిగి ప్రవేశపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. సెలెక్షన్ ప్రక్రియలో ఈ టెస్టులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కాగా అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ సిద్ధం చేసింది. కోర్ ఆటగాళ్ల జాబితాకు సంబంధించి రోడ్‌మ్యాప్ అమలుకు సిఫారసు చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్‌శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.