హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నటుడు మంచు విష్ణు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ఈ ప్రొగ్రామ్ చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం జూన్ 25 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.