ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మరో 47 మంది మంత్రులు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా సాయంత్రం 4:00 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. లక్నోలోని భారతరత్న శ్రీఅటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గత 37 ఏళ్లలో యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన నేతగా యోగి నిలవనున్నారు. 2017లో మొదటిసారి తాను సీఎంగా ఎంపికైన తర్వాత తనకు పరిపాలన అనుభవం లేదని, ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందన్నారు.