పనిచేస్తున్న సమయంలో ఉద్యోగులు ఒక్కోసారి నిద్రలోకి జారుకుంటుంటారు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం. పనిచేస్తున్నప్పుడు నిద్రపోతే అది ఉద్యోగి అసమర్థతగా భావిస్తారు. కానీ, జపాన్‌లో మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఆఫీసులో పనిచేస్తుండగా ఉద్యోగి కునుకు తీయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇనెమురి’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. అయితే, ఉద్యోగి గాఢ నిద్రలోకి వెళ్తేనే కంపెనీలు ‘ఇనెమురి’ కింద మినహాయింపును ఇస్తాయి. దీని ద్వారా ఉద్యోగి మరింత సమర్థవంతంగా పనిచేస్తాడని జపనీయుల అభిప్రాయం.