యువతిని రూంలో బంధించి సెక్యురిటీ గార్డు అత్యాచారం

© Envato

జూబ్లీహిల్స్ పరిధిలో వరుస అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 4న ఓ యువతిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పరిధిలో ఓ బస్తీకి చెందిన అమ్మాయికి అదే చోట కాపాలాదారుడిగా పనిచేస్తున్నవ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని టైం చూసి యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. తర్వాత రోజు బాధితురాలు తన స్నేహితురాలికి విషయం తెలిపింది. ఆమె యువతి సోదరికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Exit mobile version