యంగెస్ట్ మేయర్‌, యంగెస్ట్ ఎమ్మెల్యే వివాహం

కేరళలో యంగెస్ట్ మేయర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన తిరువనంతపురం మేయర్‌ ఆర్య రాజేంద్రన్‌, యంగెస్ట్‌ ఎమ్మెల్యేగా రికార్డులకెక్కిన సచిన్‌ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. ఆదివారం వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ వివాహ వేడుకకు హాజరయ్యారు. 21 ఏళ్లకే మేయర్‌గా ఎన్నికైన ఆర్యకు నెట్టింట కూడా చాలా ఫాలోయింగ్‌ ఉంది. సీపీఎం బాలసంఘం విభాగంలో పనిచేస్తున్నపుడు పరిచయమైన సచిన్ దేవ్‌ను ఆర్య వివాహమాడింది. పెళ్లయ్యాక కూడా తమ విధులు మరవబోమని, కలిసి ప్రజల కోసం పనిచేస్తామని ఆర్య రాజేంద్రన్‌ చెప్పారు.

Exit mobile version