టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘గతఏడాదిగా నాకు మద్దతుగా నిలుస్తూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. ఎన్నోఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ ఏడాది కూడా మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాతో ఉండాలని ఆశిస్తున్నా. కొత్త ఏడాది అందరికీ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని న్యూఇయర్ విషెస్ తెలిపాడు. గతేడాది 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 46.56 సగటుతో 1,164 రన్స్ చేశాడు.