నిరుద్యోగ యువతతో గల్ఫ్ స్మగ్లర్లు బలవంతంగా బంగారం, డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నట్లు డీఆర్ఐ పేర్కొంది. దుబాయ్, షార్జా తదితర ప్రాంతాల్లో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. స్మగ్లర్లు ప్రస్తుతం వారి దారి మార్చి మయన్మార్ నుంచి బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ఇటీవల మయన్మార్ నుంచి వచ్చిన లారీ ఆయిల్ ట్యాంకులో దాచి 63 కేజీల బంగారం తెస్తూ పట్టుబడ్డారు. ఇలాంటి దందాలకు నిరుద్యోగులు బలైపోతున్నారు.