TS: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ నగరంలోని ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులు ఠాణాకు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల షర్మిల ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంతరం షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం, ఠాణాకు తరలించడం.. వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.