ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలం సమర్పించారు. వివేకా హత్య కేసులో మరో ఆరుగురిని విచారించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలైంది. దీంతో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్లను విచారించాలని పిటిషన్లో కోరారు. అయితే, ఈ పిటిషన్ దాఖలు చేసిన 9 నెలలకు నేడు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.