భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అటు బ్యాటింగ్, ఇటు కెప్టెన్సీలోనూ విఫలమవుతున్న క్రమంలో ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల రోహిత్ కెప్టెన్సీపై ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ పోల్ నిర్వహించింది. ఈ పోల్లో యువీ కూడా పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాను రోహిత్ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇస్తానని తెలిపాడు. జట్టును రోహిత్ ముందుండి నడిపిస్తున్నాడని ప్రశంసించాడు.
రోహిత్ కెప్టెన్సీకి యువీ రేటింగ్; ఎంతంటే?

Screengrab Instagram: yuvisofficial