రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా ముదురుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా తగ్గకుండా ఉక్రెయిన్‌పై దాడులు జరుపుతోంది. దీంతో ఇరు దేశాల విదేశంగా అధికారులు నిన్న రెండవ విడత చర్చలు జరిపారు. అవి కూడా ఫలితం ఇవ్వలేదు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, పుతిన్‌ను ప్రత్యక్ష చర్చకు పిలుపునిచ్చారు. పుతిన్ తనతో చర్చకు రావాలని, తాను ఏమి పుతిన్‌ను కాటేయనని వ్యంగంగా పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా గతంలో ఓ మీటింగ్‌లో పుతిన్ ఓ టేబుల్‌పై చివరన కూర్చున్న ఫోటోను షేర్ చేసి, యుద్ధం ఆపడానికి చర్చకు రావాలని, కానీ 30 మీటర్ల దూరంలో కాదు అని పేర్కొన్నారు. తాను ఏమి కాటేయనని, తామిద్దరి పరస్పర చర్చలతోనే యుద్ధం సామాప్తం అవుతుందని అభిప్రాయపడ్డారు.