ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్-యురోపియన్ సభ్యత్వం దరఖాస్తుపై సంతకం చేశారు. ఈ మేరకు ప్రెసిడెంట్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ ఆండ్రీ సైబిగా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో పాటు ఉక్రెయిన్ పార్లమెంట్ అధిపతి, ప్రధాని డిమిట్రో ష్మిగల్తో కలిపి ఉమ్మడి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన జిలెన్స్కీ ‘నేను ఉక్రెయిన్-యూరోపియన్ సభ్యత్వంపై దరఖాస్తు చేశాను, అది ఖచ్చితంగా పొందుతానని నేను ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా ఈ సభ్యత్వాన్ని ప్రెసిడెన్సీ కౌన్సిల్ ఆఫ్ యురోపియన్ యూనియన్ ఆమోదించాలి, ప్రస్తుతం ఈ కౌన్సిల్ ఫ్రాన్స్‌కు వెళ్ళింది.