సమ్మర్ అంటే వెంటనే గుర్తొచ్చేది మామిడిపండు. ఈ సీజన్‌లో దొరికే మామిడి పళ్లంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. అయితే ఈ వీడియోలో ఉన్న మామిడి పండును చూస్తే మాత్రం మీరు షాకవుతారు. ఎందుకంటే ఇది మామూలు మ్యాంగో కాదు. జిప్ ఉన్న మ్యాంగో. అవును ఇందులో మ్యాంగోకి జిప్ అమర్చారు. అది ఎలాగో అర్థం కాలేదు కానీ, చూసేందుకు చాలా వింతగా ఉంది. జిప్ ఓపెన్ చేస్తే అందులో మామిడిపండు ఉంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరు కూడా ఈ జిప్ మామిడిపండును చూసేయండి మరి.