ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన వినియోగదారులకు ఆర్డర్ చేసిన తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ ఫుడ్ డెలివరీ యాప్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. వచ్చే నెల నుంచి గురుగ్రామ్‌లోని 4 స్టేషన్లలతో జొమాటో ఇన్స్టంట్ ప్రారంభం కానుంది. త్వరిత గతిన డెలివరీ చేయాలని పార్ట్నర్ రెస్టారెంట్లపై జొమాటో ఎటువంటి ఒత్తిడి చేయదని దీపిందర్ పేర్కొన్నారు.