ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, బ్లింకిట్ షేర్ స్వాప్ డీల్ ద్వారా విలీనం కానున్నట్లు సమాచారం. బ్లింకిట్ తో (గతంలో గ్రోఫర్స్)ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. Zomato గత ఏడాది గురుగ్రామ్ ఆధారిత క్విక్ కామర్స్ స్టార్టప్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు బ్లింకిట్‌లో 10% వాటాను కైవసం చేసుకుంది. దీంతో Zomato ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా Blinkit విలువ తగ్గినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ద్వారా జొమాటోలో ఇన్వెస్టర్ అయిన టైగర్ గ్లోబల్ వంటి పెట్టుబడిదారులతో పాటు బ్లింకిట్ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ ఫుడ్ డెలివరీ సంస్థలో వాటాను పొందనున్నట్లు సమాచారం.