• TFIDB EN
  • Editorial List
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
    Dislike
    200+ views
    1 month ago

    మార్చి నెల సినిరంగానికి మిశ్రమ ఫలితాలను అందించింది. కొన్ని పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గామి(మార్చి 08 , 2024)
    U/A|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
    అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ. 19.9కోట్లు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.13.38 కోట్లు

    2 . ఆపరేషన్ వాలెంటైన్(మార్చి 01 , 2024)
    U/A|130 minutes|యాక్షన్,థ్రిల్లర్
    రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) భారత వైమానిక దళంలో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్‌తో ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? అన్నది స్టోరీ

    ప్రపంచవ్యాప్యంగా కలెక్షన్లు రూ.10.27కోట్లు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ. 8.58కోట్లు

    3 . భీమా(మార్చి 08 , 2024)
    U/A|యాక్షన్,డ్రామా
    బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరుశురామ క్షేత్రం దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.15.19 కోట్లు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.12.99కోట్లు

    4 . సుందరం మాస్టర్(ఫిబ్రవరి 23 , 2024)
    U|హాస్యం,డ్రామా
    సుందరం మాస్టర్‌ గవర్నమెంట్‌ టీచర్‌. ఇంగ్లీష్‌ నేర్పడం కోసం ఓ మిస్టరీ గ్రామానికి వెళ్తాడు. అక్కడి పరిస్థితులు సుందరంను ఆశ్చర్య పరుస్తాయి. ఆ గ్రామస్తులు ఎలా ఉన్నారు? సుందరంకు ఎమ్మెల్యే అప్పగించిన రహస్య పని ఏంటి? దాన్ని నెరవేర్చాడా లేదా? అన్నది కథ.

    ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.2.06 కోట్లు

    5 . రజాకార్ - సైలెంట్ జెనోసిదే అఫ్ హైదరాబాద్(మార్చి 15 , 2024)
    U/A|హిస్టరీ
    హైదరాబాద్‌ సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చాలని నైజాం ప్రభువు నిర్ణయించుకుంటాడు. రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకొని బలవంతపు మత మార్పిడిలకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ప్రజలను రజాకార్లు దారుణంగా హింసిస్తారు. దీంతో వారికి వ్యతిరేకంగా ప్రజలు ఎలాంటి పోరాటం చేశారు? కేంద్ర హోంమంత్రి పటేల్ సమస్యను ఎలా పరిష్కరించారు? అన్నది కథ.

    ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.3.79కోట్లు

    6 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
    U/A|హాస్యం,డ్రామా
    క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

    ప్రపంచ వ్యాప్తంగా (మార్చి 27నాటికి) నెట్ కలెక్షన్లు రూ.14కోట్లు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ. 9.10కోట్లు


    @2021 KTree