Sun NXT యాప్‌లో టాప్ 10 రొమాంటిక్ సినిమాలు
2k+ views6 months ago
Sun NXTలో వచ్చిన రొమాంటిక్ చిత్రాల్లో టాప్ రేటెడ్ సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో పెళ్లి చూపులు, చిలసౌ, ఆర్య వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీ మనసుకు నచ్చే సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి.
1 . లాఠీ(undefined 00 , 1992)
U/A|డ్రామా,రొమాన్స్
లాఠీ అనేది గుణశేఖర్ దర్శకత్వం వహించిన 1992 భారతీయ తెలుగు-భాష యాక్షన్ రొమాన్స్ చిత్రం, ఇందులో ప్రశాంత్, సంయుక్త సింగ్ మరియు రఘువరన్ నటించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం తరువాత తమిళంలోకి డబ్ చేయబడి దావూద్ ఇబ్రహీం పేరుతో విడుదల చేయబడింది.
2 . ఒక్కడు(జనవరి 15 , 2003)
U|యాక్షన్,రొమాన్స్
అజయ్ జాతీయ స్థాయి కబడ్డి ప్లేయర్. శిక్షణ నిమిత్తం కర్నూలుకు వెళ్తాడు. అక్కడ స్వప్న అనే అమ్మాయిని ఓబుల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు చెర నుంచి కాపాడుతాడు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి తన కుటుంబానికి తెలియకుండా ఇంట్లోనే ఉంచుతాడు. మహేష్ బాబు కేరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా.
3 . ఆర్య(మే 07 , 2004)
U|డ్రామా,రొమాన్స్
అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.
4 . నాన్నకు ప్రేమతో(జనవరి 13 , 2016)
U/A|యాక్షన్,డ్రామా,రొమాన్స్
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
5 . పెళ్లి(ఆగస్టు 01 , 1997)
U|డ్రామా,రొమాన్స్
నవీన్.. తన కాలనీలో ఓ పెద్దావిడతో జీవిస్తున్న మహేశ్వరిని ప్రేమిస్తాడు. అయితే ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి అవుతుంది. అతడు సైకోగా మారి చిత్రహింసలు పెడుతుండటంతో విడిపోయి దూరంగా బతుకుతుంటుంది. అయితే నవీన్‌తో పెళ్లికి అంగీరించినప్పుడు ఆమె భర్త ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏం జరిగింది?ఆ పెద్దావిడకు ఆమె భర్తకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అన్నది కథ.
6 . ఎవడే సుబ్రమణ్యం(మార్చి 21 , 2015)
U|డ్రామా,రొమాన్స్
మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈక్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు.
7 . శ్రీకారం(మార్చి 11 , 2021)
U|రొమాన్స్,డ్రామా
కార్తిక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్‌లో లక్షల్లో సంపాదిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో గ్రామంలో పెరగటం వల్ల వ్యవసాయంపై ఇష్టం ఏర్పడుతుంది. జాబ్‌కు రిజైన్ చేసి వ్యసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ కార్తిక్ తండ్రి అందుకు ఒప్పుకోడు. ఇద్దరి మధ్య అగాథం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ .
8 . పెళ్లి చూపులు(జూలై 29 , 2016)
U|హాస్యం,డ్రామా,రొమాన్స్
పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
9 . తొలి ప్రేమ(ఫిబ్రవరి 10 , 2018)
U/A|హాస్యం,రొమాన్స్
ఆదిత్య (వరుణ్ తేజ్) రైలులో వర్ష (రాశీఖన్నా)ను చూసి ప్రేమిస్తాడు. తాను చదువుతున్న ఆమె కాలేజీకే రావడంతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాలేజీలో జరిగిన ఓ గొడవ మూలంగా ఆదిత్య వర్షను వదిలి వెళ్లిపోతాడు. ఆరేళ్ల తర్వాత వర్ష మళ్లీ ఆదిత్య జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు కలిశారా లేదా? అన్నది కథ.
10 . ప్రేమంటే ఇదేరా(అక్టోబర్ 30 , 1998)
U|రొమాన్స్
ఓ పోలీసుతో నిశ్చితార్థం జరిగిన యువతిని మురళి ప్రేమిస్తాడు. ఆమె కుటుంబానికి దగ్గరయ్యేందుకు పెళ్లి ఏర్పాట్లలో పాలుపంచుకుంటాడు. ఈ పెళ్లిని మురళి ఎలా అడ్డుకున్నాడు? తన ప్రేమను ఏ విధంగా గెలిపించుకున్నాడు? అన్నది కథ.