• TFIDB EN
  • AR రెహమాన్
    ఎ. ఆర్. రెహ్మాన్ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం కెరీర్ ఆరంభించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా(1992) చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. రెహమాన్ గీతాలు, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన ప్రధానంగా హిందీ, తమిళ్, తెలుగు, మలయాళి భాషల్లో సంగీతం అందించారు. రంగీలా, లగాన్, రంగ్ దే బసంతి, జోధా అక్బర్, గజని, రోబో, రోజా, జెంటిల్ మెన్, జీన్స్, నానీ, సఖి, ప్రేమదేశం, భారతీయుడు, స్లమ్‌డాగ్ మిలీనియర్ వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన తన కెరీర్‌లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు ఉన్నాయి.


    @2021 KTree