• TFIDB TE
  • Manisha Koirala
    Born : August 16 , 1970
    Place: Kathmandu, Nepal
    Manisha Koirala is a Nepalese actress who is known for working in Indian films, predominantly in Hindi and Tamil films, and has also worked in Telugu, Bengali, Malayalam, Nepali, and English films. She is the recipient of several accolades, including four Filmfare Awards, and has been awarded the Order of Gorkha Dakshina Bahu by the Government of Nepal.
    నాగార్జున (Nagarjuna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నాగార్జున (Nagarjuna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్ టాలీవుడ్‌లో మన్మథుడిగా గుర్తింపు పొందిన నాగార్జున ఇండస్ట్రీలో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు పొందారు. తెలుగులో లెజెండరీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన మాస్‌ ఇమేజ్‌ను పొందాడు. ఆయ కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. శివ, గీతాంజలి, అన్నమయ్య చిత్రాలతో చెరగని ముద్ర వేశారు. ప్రేక్షకుల హృదయాల్లో నమ మన్మథుడిగా స్థానం సంపాదించిన నాగార్జున గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకోసం.. నాగార్జున అసలు పేరు? అక్కినేని నాగార్జున రావు నాగార్జున ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నాగార్జున నటించిన తొలి సినిమా? నాగార్జునకు రెండేళ్ల వయసులో వెలుగు నీడలు(1961) అనే తన తండ్రి చిత్రం ద్వారా బాలనటుడిగా ఆరంగేట్రం చేశాడు. నాగార్జున ఎక్కడ పుట్టారు? చెన్నై నాగార్జున పుట్టిన తేదీ ఎప్పుడు? 1959 ఆగస్టు 29 నాగార్జున భార్య పేరు? మొదటి భార్య పేరు లక్ష్మి దగ్గుపాటి(1984-1990), రెండో భార్య పేరు అమల(1992- ప్రస్తుతం) నాగార్జున అభిరుచులు? పుస్తకాలు చదవడం, జిమ్‌లో వర్క్స్‌వుట్ చేయడం.  నాగార్జున హీరోగా నటించిన తొలిసినిమా? విక్రమ్(1986) నాగార్జున అభిమాన నటుడు? అమితాబ్ బచ్చన్ నాగార్జున అభిమాన హీరోయిన్? టబు నాగార్జున ఫెవరెట్ రెస్టారెంట్? N ASIAN నాగార్జునకు స్టార్ డం అందించిన చిత్రం? శివ నాగార్జునకి ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ నాగార్జున తల్లిదండ్రుల పేర్లు? అక్కినేని నాగేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మ నాగార్జున ఏం చదివారు? ఇంజనీరింగ్ నాగార్జున ఎన్ని సినిమాల్లో నటించారు? 100కి పైగా సినిమాల్లో నటించారు నాగార్జునకి ఇష్టమైన ఆహారం? గ్రిల్డ్ చికెన్‌ను నాగార్జున ఇష్టంగా తింటాడు. దీనితో పాటు చేపల పులుసు, దోశ అంటే ఇష్టం https://www.youtube.com/watch?v=HRVE2bZg5Uk నాగార్జున వ్యాపారాలు? ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్‌ టీంకు సహ యజమానిగా ఉన్నారు.అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు హైదరాబాద్‌లో N కన్వెన్షన్స్ పేరుతో ఫంక్షన్ హాళ్లు ఇతర వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. నాగార్జున నికర ఆస్తుల విలువ ఎంత? రూ.3100కోట్లు నాగార్జున సినిమాకు ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటారు.
    March 19 , 2024
    Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్‌ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా? టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్‌ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్‌ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  నాగార్జునపై కేసు నమోదు సినీ హీరో నాగార్జునపై క్రిమినల్‌ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారని, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.  రూ.100 కోట్ల స్థలం కబ్జా! నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.  https://twitter.com/jsuryareddy/status/1842478697938403807 కక్ష్య సాధింపు చర్యలేనా! తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్‌ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.  తీవ్రంగా ఖండించిన టాలీవుడ్‌ అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్‌ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అటు తారక్‌ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్‌ నటుడు వెంకటేష్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
    October 05 , 2024
    HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా? తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్‌ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్‌ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్‌లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.  1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.  టబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన 'బజార్' చిత్రం ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌. https://twitter.com/mimansashekhar/status/1710632340022591556 సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్‌ నేమ్స్‌ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్‌, టబ్స్‌, టబ్బీ, టోబ్లర్‌, టోబ్లెరోన్‌ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో టబు సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది.  ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్‌ సూపర్‌ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. హిందీ వచ్చిన ప్రేమ్‌ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్‌ తమ్ముడు సంజయ్‌ కపూర్‌ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్‌ స్టార్ట్‌ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమ్‌ సినిమా సెట్స్‌లోనే నటుడు సంజయ్‌ కపూర్‌తో  టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.  తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు.  ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.  బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గన్‌తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్‌ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది. అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్‌ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్‌లో రూమర్లు ఉన్నాయి. 'భోలా' సినిమా ప్రమోషన్స్‌ సమయంలో టబుతో రిలేషన్‌పై అజయ్ దేవ్‌గన్‌ కూడా మాట్లాడారు. టీనేజ్‌ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో 'హమ్‌ సాథ్‌ సాథ్‌' షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు. తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్‌ సీన్స్‌లో తప్పనిసరిగా గ్లిజరిన్‌ వాడతానని తెలిపింది. ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తూ ట్రెండ్‌కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్‌గా కనిపిస్తూ మెపిస్తోంది.
    November 04 , 2024
    HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా! అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్‌, క్లాస్‌, ఆధ్యాత్మికం, లవ్‌ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్‌ ‌అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్‌ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  'శివ'తో సెన్సేషన్‌ సాధారణంగా కెరీర్‌ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్‌ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్‌ వర్మకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్‌ స్టెప్‌ ‌అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా  ‘శివ’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నాగ్‌ కెరీర్‌తో పాటు టాలీవుడ్‌ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్‌ - రామ్‌గోపాల్‌ వర్మ చెక్‌ పెట్టారు.  వైవిధ్యతకు ప్రాధాన్యం శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్‌ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్‌ నేచురల్‌ హెయిస్ట్‌ ఫిల్మ్‌, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్‌’లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా మారిపోయాడు.  ‘అన్నమయ్య’ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి హీరోలు కమర్షియల్‌ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ రావడం విశేషం.  మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు.. ‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.  కొత్తవారికి ఛాన్స్‌.. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ (శివ), వైవీఎస్‌ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్‌ (మాస్‌), విజయ్‌ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్‌ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్‌. తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్‌ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్‌, ఫాజిల్‌, రవిచందర్‌, మహేష్‌ భట్‌ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్‌ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్‌ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్‌ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్‌ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  https://twitter.com/thokkaloteja/status/1828863171152757038 బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా.. సాధారణంగా స్టార్‌డమ్‌ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌, తారక్‌ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్‌ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్‌ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.  https://twitter.com/i/status/1829013612117230039 ఫిట్‌నెస్‌ మంత్ర నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్‌ ఫిజిక్‌ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్‌ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్‌’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్‌ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
    August 29 , 2024

    Discover everything about Manisha Koirala, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Manisha Koirala's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Manisha Koirala on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.

    @2021 KTree