
Ravi Raja Pinisetty
Place: Palakollu, Andhra Pradesh, India
Ravi Raja Pinisetty is an Indian film director best known for his works in the Telugu cinema with actors such as Chiranjeevi, Nandamuri Balakrishna, Mohan Babu, Rajasekhar, and Daggubati Venkatesh. He has directed about 40 films so far, including some major hits like Yamudiki Mogudu with Chiranjeevi.
Articles

Meenakshi Chaudhary: నాజూకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తున్న మీనాక్షి చౌదరి
కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది మీనాక్షి చౌదరి. తన నటన, అందంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హర్యానా అందాల తెగింపు మీనాక్షి చౌదరి మరోసారి అందాల విందు చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెట్టి కవ్విస్తోంది.
'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రంలో ఈ భామ నటిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
నాజుకైన నడుమందాలతో సోగసుల పసందు చేస్తోంది. నాభి అందాలను ఏకరువు పెడుతూ గిలిగింతలు పెడుతోంది.
అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్-2’లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది
ఆ తర్వాత రవితేజ పక్కన ‘ఖిలాడి’ మూవీలో నటించి అందాల జాతర చేసింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ సుందరాంగి కెరీర్ సైడ్ ట్రాక్‌లోకి వెళ్లింది.
గుంటూరు కారంతో పాటు, ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న డీజే టిల్లు సిక్వేల్‌లో సెకండ్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.
ఇక మీనాక్షి చౌదరి వ్యక్తిగత విషయానికి వస్తే.. సినిమాల్లోకి రాకముందు ఈ చక్కనమ్మ.. తొలుత కొన్ని సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల్లో నటించింది.
2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ సుందరాంగి.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో పెద్ద ఎత్తున ఫాలోవర్లను సంపాదించుకుంది.
తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోంది. నాజుకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తోంది.
July 05 , 2023
Mechanic Rocky Review: విష్వక్ సూపర్.. ఆ తప్పు చేయకుంటే బొమ్మ బ్లాక్ బాస్టరయ్యేది!
నటీనటులు: విష్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేదీ: 22-11-2024
యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwak Sen) నుంచి ఈ ఏడాది వచ్చిన ‘గామి’ (Gaami), ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky Review)తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విష్వక్ (Vishwaksen) వచ్చేశాడు. అతడు నటించిన మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న గ్రాండ్‌గా రిలీజైంది. ఇందులో విష్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) చేశారు. రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. విష్వక్ హ్యాట్రిక్ కొట్టాడా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
రాకీ (విష్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ (నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేరిపోతాడు. రిపేర్లతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. కాలేజీ మానేయడంతో వారు విడిపోతారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? కథలో రాంకీ రెడ్డి (సునీల్) ఎవరు? అతడి ఎంట్రీతో రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విష్వక్ సేన్ (Mechanic Rocky Review) ఎప్పటిలాగే సెటిల్ నటనతో అదరగొట్టాడు. హుషారైన పాత్రలో ఎంతో యాక్టివ్‌గా కనిపించి ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైనా పంచ్‌లతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. అందంగా కనిపిస్తూ హావభావాలను చక్కగా పలికించారు. కొన్ని సన్నివేశాల్లో పోటీపడి మరి నటించారు. తెరపై మీనాక్షి, విష్వక్ సేన్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వారి లవ్‌ట్రాక్ కూడా బాగుంది. సునీల్, నరేష్, హర్షవర్ధన్‌కు కూడా బలమైన పాత్రలే దక్కాయి. హర్ష చెముడు తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను జోడించి నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రవితేజ ముళ్లపుడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో బలమైన అంశాలను తెరపై చూపినప్పటికీ, అవసరానికి మించిన కమర్షియల్ హంగులు, కామెడీ సన్నివేశాలు కారణంగా అవి తెలిపోయాయి. ఫస్టాఫ్ మెుత్తం పాత్రల పరిచయానికి, హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్, కమర్షియల్ హంగులు, పాటలు మధ్య రొటిన్‌గా సాగిపోతుంది. సాగదీసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండాఫ్ నుంచి అసలైన కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. ద్వితీయార్థమే సినిమాకు బలం. అనూహ్యమైన ట్విస్టులు, ప్రతీ పాత్ర కథను మరో మలుపుకు తీసుకెళ్లడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మిడిల్ క్లాస్ వారి కోరికలను ఆసరగా చేసుకొని కొందరు ఎలా మోసం చేస్తారో దర్శకుడు చక్కగా చూపించాడు. ఫస్టాఫ్ విషయంలో దర్శకుడు జాగ్రత్తపడి ఉంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యేదని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే (Mechanic Rocky Review) సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ (Mechanic Rocky music director) నేపథ్య సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ తనకు ఇచ్చిన బాధ్యతను వందశాతం నెరవేర్చాడు. ఫస్టాఫ్ విషయంలో ఎడిటర్ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విష్వక్ నటనసెకండాఫ్‌ట్విస్టులు
మైనస్ పాయింట్స్
ప్రథమార్థంకమర్షియల్ హంగులు
Telugu.yousay.tv Rating : 2.5/5
November 22 , 2024
Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్ చంద్ర, కిషోర్ కుమార్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, మైమ్ గోపి, రూపలక్ష్మీ తదితరులు
రచన, దర్శకత్వం : కరుణ కుమార్
సంగీతం : జి. వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్
ఎడిటింగ్ : కార్తికేయ శ్రీనివాస్
నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల
విడుదల తేదీ: 14-11-2024
మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review)
కథేంటి
మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. పాకిస్తాన్ నుంచి ముంబయికి వచ్చిన రతన్ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
వాసు పాత్రలో వరుణ్ తేజ్ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్ స్టైల్, వాకింగ్ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోనితో పాటు నవీన్ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఒకప్పటి గ్యాంగ్ స్టార్ రతన్ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్ అయ్యింది. కెమెరామెన్ కిషోర్ కుమార్ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా పీరియాడిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్ డైరెక్టర్ జి. వి. ప్రకాష్ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు
Telugu.yousay.tv Rating : 2.5/5
November 14 , 2024
The GOAT Review: దళపతి విజయ్ తనతో తానే తలపడాల్సి వస్తే.. ‘ది గోట్’ గ్రేట్‌గా ఉందా? లేదా?
నటీనటులు : విజయ్, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్ త్యాగరాజన్, కొకిలా మోహన్, జయరాం, స్నేహా, వీటీవీ గణేష్, అరవింద్ ఆకాష్, వైభవ్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం : వెంకట్ ప్రభు
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నూని
ఎడిటింగ్ : వెంకట్ రాజన్
నిర్మాతలు : కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేశ్, కల్పతి ఎస్. సురేష్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? విజయ్‌కు మరో మరుపురాని విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూ (The Greatest of All Time Telugu Review)లో తెలుసుకుందాం.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
దళపతి విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. గాంధీ పాత్రలో ఎప్పటిలాగే అదరగొట్టాడు. అయితే జీవన్ పాత్రలో యంగ్ విజయ్ డిజిటలైజ్డ్ లుక్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఇక యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ మరోమారు తన మార్క్ చూపించాడు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. స్పెషల్ స్క్వాడ్ సభ్యులుగా ప్రశాంత్, అజ్మల్, ప్రభుదేవా పర్వాలేదనిపించారు. వారికి హెడ్‌గా జయరాం తన నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ విజయ్‌కు జోడీగా చేసిన స్నేహా తన నటనతో మెప్పించింది. తమిళ యువ హీరో శివ కార్తికేయన్ చిన్న పాత్రలో సందడి చేశారు. త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పూర్తిగా తేలిపోయాయి. ఏది మైండ్‌లో గుర్తుంచుకునేలా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లను బీజీఎం మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఇంకాస్త బెటర్‌గా పనిచేయాల్సింది. ముఖ్యంగా విజయ్ డీఏజింగ్ లుక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంప్రథమార్ధం
Telugu.yousay.tv Rating : 2.5/5
September 05 , 2024

Malupu
Released On 19 February 2016

Veede
Released On 31 October 2003

Adhipathi
Released On 19 September 2001

Maa Annayya
Released On 01 December 2000

Alludugaaru Vachcharu
Released On 18 June 1999
.jpeg)
Raayudu
Released On 01 July 1998

Devudu
Released On 23 October 1997
.jpeg)
Rukmini
Released On 18 September 1997

Saradha Bullodu
Released On 09 August 1996

Aranyam
Released On 01 January 1996

Pedarayudu
Released On 15 June 1995
Discover everything about Ravi Raja Pinisetty, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Ravi Raja Pinisetty's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Ravi Raja Pinisetty on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.