• TFIDB TE
  • Suresh
    Born : August 23 , 1963
    Place: Srikalahasti, Andhra Pradesh, India
    Mysore Seshaiah Suresh Babu Naidu is an Indian actor, producer, director, and dubbing artist. He has acted predominantly in Tamil and Telugu languages.
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు 'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే  చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.  భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.  తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.  ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.  అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.  అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.  సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.  మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.  ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.  ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.   పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.  సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.  హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.  ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.  గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    March 22 , 2024
    Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్‌ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్? మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో  అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.  లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.  భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్  ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.  విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది. కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి. రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.  ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు.  ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది.  ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే...  శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.  క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు.   అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు. రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
    September 06 , 2023
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే! తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.  విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.  సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.  నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.  తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.  అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.  ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన  'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు. 
    April 17 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ! టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.  ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు  సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.  హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    February 24 , 2024

    Discover everything about Suresh, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Suresh's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Suresh on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.

    @2021 KTree