
.jpeg)

.jpeg)
కల్ట్ క్లాసిక్ తెలుగు సినిమాలు
ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన సినిమాలను కల్ట్ సినిమాలు అంటారు. వాటి ప్రత్యేక శైలీ, అసాధారణమై కథనం.. ఏళ్లు గడిచినా ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి.

1 . పాతాళ భైరవి(మార్చి 15 , 1951)
U|195 minutes|డ్రామా,ఫాంటసీ
ఉజ్జయిని యువరాణి ఇందుమతితో సాధారణ తోటమాలి కొడుకు అయిన తోటరాముడు ప్రేమలో పడుతాడు. ఈ విషయం తెలిసిన మహారాజు అతన్ని మందలిస్తాడు. కానీ తోటరాముడు, యువరాణిని తనతో పెళ్లి చేయాలంటే ఏం కావాలో అడగమని రాజును ఛాలెంజ్ చేస్తాడు. అయితే తన దగ్గర ఉన్న సంపదతో సమానమైన సంపదను తెస్తే పెళ్లి చేస్తానని మహారాజు హామీ ఇస్తాడు. మరి తోటరాముడు అంత ఆస్తిని సంపాదించాడా? లేదా అన్నది మిగతా కథ
.jpeg)
2 . గీతాంజలి(మే 12 , 1989)
UA|135 minutes|రొమాన్స్
క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రకాష్.. అదే సమస్యతో పోరాడుతున్న గీతాంజలిని ప్రేమిస్తాడు. ప్రకాష్ అనారోగ్యం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె అతడి జీవితం నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.

3 . గూడాచారి 116(ఆగస్టు 11 , 1966)
U|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
అంతర్జాతీయ క్రిమినల్ ముఠాకు వ్యతిరేకంగా ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించిన తర్వాత సీక్రెట్ ఏజెంట్ 303 హత్యకు గురవుతాడు. దీంతో ఏజెంట్ 116 తన సహోద్యోగి హత్య గురించి నిజాన్ని వెలికితీసే లక్ష్యంతో బయలుదేరాడు.
.jpeg)
4 . శంకరాభరణం(ఫిబ్రవరి 02 , 1980)
U|143 minutes|మ్యూజికల్
శంకర శాస్త్రి సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీత గాయకుడు, అతన్ని ఒక వేశ్య కుమార్తె తులసి అభిమానిస్తుంది. అతనికి సేవ చేయాలని కోరుకుంటుంది. అయితే ఆమె తల్లి మాత్రం వేశ్యగా మారాలని బలవంతం చేస్తుంది.

5 . స్వాతి ముత్యం(మార్చి 13 , 1986)
U|161 minutes|డ్రామా,ఫ్యామిలీ
మంద బుద్ధితో బాధపడుతున్న శివయ్య తన అమ్మమ్మతో కలిసి గ్రామంలో జీవిస్తుంటాడు. అక్కడ వితంతువు లలితను ఆమె వదిన వేదింపుల నుంచి రక్షించడానికి ఆమెను పెళ్లి చేసుకోవడంతో వారి జీవితం మలుపు తిరుగుతుంది.

6 . గుండమ్మ కథ(జూన్ 07 , 1962)
U|166 minutes|హాస్యం,డ్రామా
గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు.

7 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.
.jpeg)
8 . నర్తనశాల(అక్టోబర్ 11 , 1963)
U|174 minutes|డ్రామా,మ్యూజికల్
పాండవులు 13 సంవత్సరాల వనవాసాన్ని ముగించి, విజయదశమి వరకు తమ నిజస్వరూపాన్ని దాచుకోవాలి. అర్జున్ కుమారుడు, అభిమన్యు, విరాట కుమార్తె ఉత్తరాతో ప్రేమలో పడతాడు, కానీ అతని గుర్తింపును వెల్లడించలేదు.
.jpeg)
9 . మల్లీశ్వరి(డిసెంబర్ 20 , 1951)
U|175–194 minutes|డ్రామా,రొమాన్స్
రాణి వాసం అంటే అందమైన యువతులు వచ్చి ప్యాలెస్‌లో బస చేయడం, మగవాళ్లను కలవడానికి వీలుండదు. అయితే నాగరాజును గాఢంగా ప్రేమిస్తున్న మల్లీశ్వరి తనకు ఇష్టం లేకున్న రాణివాసం వెళ్లాల్సి వస్తుంది. ఈక్రమంలో వేరుపడిన నాగరాజు, మల్లీశ్వరి విరహ వేదనను అనుభవిస్తారు.
.jpeg)
10 . ఖుషి(ఏప్రిల్ 27 , 2001)
UA|177 minutes|రొమాన్స్
మధు, సిద్ధూలు కాలేజీ ఫ్రెండ్స్. అపార్థాల కారణంగా దూరంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న ఇగో కారణంగా చెప్పుకోరు. అయితే మధు, సిద్ధూ ప్రాణ స్నేహితుల ప్రేమ ప్రమాదంలో పడినప్పుడు వీరిద్దరూ కలిసి వారి ప్రేమను గెలిపిస్తారు. ఈ ప్రయాణంలో ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుసుకుని కలిసేందుకు ప్రయత్నిస్తారు.

11 . మూగ మనసులు(జనవరి 31 , 1964)
U|160 mins|డ్రామా
కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ కోసం గోదావరిలో పడవ ప్రయాణం చేస్తుండగా వారికి సుడిగుండాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఆ జంటకు గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి.

12 . ఆదిత్య 369(జూలై 18 , 1991)
U|141 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ

13 . ఒసేయ్ రాములమ్మ(మార్చి 07 , 1997)
A|165 minutes|యాక్షన్,డ్రామా
ఈ చిత్రం తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నిమ్నకులాలపై ఉన్నతవర్గాల చేసిన అకృత్యాలను బయటపెట్టింది. రాములమ్మ గిరిజన యువతి. ఆమెపై ఉన్నత కులానికి చెందిన దొర అత్యాచారం చేస్తాడు. న్యాయం కోరిన ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తాడు. అతనిపై ప్రతీకారంతో రాములమ్మ నక్సలైట్ బృందంలో చేరుతుంది.
.jpeg)
14 . దేవత(సెప్టెంబర్ 04 , 1982)
A|డ్రామా,రొమాన్స్
జానకి తన చెల్లెలు లలిత కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అయితే తను ప్రేమించిన రాంబాబునే అక్క ప్రేమిస్తున్నట్లు లలిత తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? అక్క కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధ పడింది? అన్నది కథ.
.jpeg)
15 . అహ నా-పెళ్లంట!(నవంబర్ 27 , 1987)
U|147 minutes|హాస్యం
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు.

16 . ఆకలి రాజ్యం(జనవరి 09 , 1981)
A|141 minutes|డ్రామా
ఒక నిరుద్యోగ యువకుడు దేశ రాజధానిలో ఉద్యోగం కోసం వెతుకుతున్న సందర్భంలో ఎదొర్కొన్న సమస్యలే ఈ సినిమా కథ. ఆకలి, మనిషి వ్యక్తిత్వం, మానవ సంబంధాలు, సమాజాన్ని చూసే ధృక్కొణం వంటి అంశాలు ఈ సినిమాలో అంతర్భాగంగా ఉంటాయి. ఈ సినిమాలో శ్రీశ్రీ కవితలు ఆలోచింపజేస్తాయి.
.jpeg)
17 . శివరంజని(undefined 00 , 1978)
U|డ్రామా
శివరంజని 1978లో దాసరి నారాయణరావు రచన మరియు దర్శకత్వం వహించిన తెలుగు నాటక చిత్రం. ఈ చిత్రం పల్లెటూరి అమ్మాయి శివరంజని, జయ సుధ పోషించిన ప్రముఖ సినీ నటిగా అవతరించింది. తర్వాత 1980లో శ్రీప్రియ ప్రధాన పాత్రలో తమిళంలో నచ్చతిరమ్‌గా రీమేక్ చేయబడింది.

18 . బడి పంతులు(నవంబర్ 22 , 1972)
U|165 minutes|డ్రామా
పదవీ విరమణ తర్వాత, రాఘవరావు అతని భార్య పిల్లల చేత కష్టాలు పడుతారు. అతని పిల్లలు ఇంటిని అమ్మి భార్యభర్తలను వేరు చేసి రొటేషన్ విధానంలో వారికి ఆశ్రయం కల్పిస్తూ అవమానిస్తారు.

19 . చూడాలని వుంది(ఆగస్టు 27 , 1998)
U|148 minutes|థ్రిల్లర్
తన తండ్రి పంపిన గూండాల బారి నుంచి భర్త రామకృష్ణను కాపాడే క్రమంలో ప్రియా చనిపోతుంది. అక్రమ కేసులో ఇరుక్కొని రామకృష్ణ జైలుకు వెళ్లగా అతడి కొడుకును ప్రియా నాన్న తీసుకెళ్తాడు. బయటకొచ్చిన రామకృష్ణ ఓ మహిళ సాయంతో తన బిడ్డను ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.

20 . సీతా రామం(ఆగస్టు 05 , 2022)
U|163 minutes|రొమాన్స్
ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంతకీ ఈ ఆమె ఎవరు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెని కలుసుకునేందుకని వచ్చిన రామ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ.