.jpeg)



తెలుగులో భక్తి ప్రాధాన్యమైన చిత్రాలు
తెలుగులో ఈ మధ్య భక్తి ప్రధానమైన చిత్రాలు రావడమే అరుదుగా మారాయి. కానీ ఒకప్పుడు భక్తి ప్రధానమైన చిత్రాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ప్రేక్షకులను భక్తిరసంలో ఓలలాడించాయి. భగవంతుడు- భక్తుడు, ఆత్మ- పరమాత్మ మధ్య సంబంధం, దేవుడి ఉనిఖి కథావస్తువుగా ఆవిష్కరించి ప్రేక్షకులక ఆధ్యాత్మిక అనుభూతిని పంచిన చిత్రాలు మీకోసం
.jpeg)
1 . అన్నమయ్య(నవంబర్ 11 , 1997)
U|147 minutes|డ్రామా,మ్యూజికల్
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుని జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అన్నమయ్య పాత్రను అక్కినేని నాగార్జున పోషించారు.

2 . భక్త కన్నప్ప(undefined 00 , 1976)
U|డ్రామా,ఫ్యామిలీ
భక్త కన్నప్ప బాపు దర్శకత్వం వహించిన 1976 భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రం శైవ భక్తుడైన కన్నప్ప నాయనార్ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ నటించిన 1954 కన్నడ చిత్రం బెదర కన్నప్పకు రీమేక్.

3 . అమ్మోరు(నవంబర్ 23 , 1995)
U|124 minutes|ఫాంటసీ,హారర్
భవాని అమ్మవారి భక్తురాలు. ఓ మాంత్రికుడ్ని జైలుకు పంపుతుంది. బయటకొచ్చిన అతడు ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాడానికి ప్రయత్నిస్తాడు. దీంతో భవాని అమ్మవారి సాయం కోరుతుంది.

4 . దేవుళ్ళు(నవంబర్ 09 , 2000)
U|149 mins|డ్రామా,ఫ్యామిలీ
తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారని తెలుసుకున్న ఇద్దరు పిల్లలు వారు విడిపోకుండా కలిసి ఉండాలని తమ అమ్మమ్మ కోరిక మేరకు ఏడు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు బయల్దేరుతారు. ఈక్రమంలో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

5 . శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం(జనవరి 01 , 1986)
U|డ్రామా
భగవాన్ షిర్డి సాయిబాబా, ప్రజలను ధర్మ మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తున్నప్పుడు అనేక సవాళ్లు మరియు పోరాటాలను ఎదుర్కొంటారు.

6 . శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(నవంబర్ 29 , 1984)
U|173 minutes|డ్రామా,మ్యూజికల్
కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నందమూరి తారక రామారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు లీడ్ రోల్లో చేశారు.

7 . శ్రీరామదాసు(మార్చి 30 , 2006)
U|150 minutes|డ్రామా,మ్యూజికల్
గోపన్న కమలను వివాహం చేసుకుని హుస్నాబాద్‌కు తహశీల్దార్‌గా వెళ్తాడు. అక్కడ రామదాసు రాముడికి గుడి కట్టడంతో గొల్కొండ నవాబు అతన్ని బందీగా చేస్తాడు

8 . గురుపూర్ణిమ(జనవరి 15 , 1999)
U|146 minutes|డ్రామా
సూర్యకు పుట్టుకతోనే అరచేతిలో స్వస్తిక్ మచ్చ ఉంటుంది. ఈ మచ్చ ఉన్న వ్యక్తిని బలిస్తే.. మరణాన్ని జయించవచ్చని ఓ క్షుద్ర మాంత్రికుడు నమ్ముతాడు. దీంతో సూర్యను బలిచ్చేందుకు అనేక రకాల కుట్రలు పన్నుతాడు. మరి సూర్య ఆ మాంత్రికుడిని నుంచి తప్పించుకున్నాడా? అతన్ని కాపాడింది ఎవరు అనేది మిగతా కథ.

9 . త్రినేత్రం(డిసెంబర్ 06 , 2002)
U|డ్రామా,ఫాంటసీ
అరుణ.. వివేక్‌ను ప్రేమిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించి ప్రేతాత్మగా మారుతుంది. పెళ్లైన వివేక్‌ను పట్టి పీడిస్తూ తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. వివేక్ భార్య రాశి దైవబలంతో తన భర్తను ఎలా కాపాడుకుంది? అన్నది కథ.
.jpeg)
10 . దేవి(మార్చి 12 , 1999)
U|డ్రామా,ఫాంటసీ
దేవి ఒక నాగ దేవత. తన కోసం మరణించిన వ్యక్తి కుమార్తె సుశీలకు అండగా ఉంటాని ప్రతిజ్ఞ చేస్తుంది. అయితే సుశీలపై ఓ రాక్షసుడి కన్ను పడుతుంది. అతడి నుంచి సుశీలను దేవి ఎలా కాపాడింది? అన్నది కథ.

11 . షిర్డీ సాయి(సెప్టెంబర్ 06 , 2012)
U|142 minutes|డ్రామా
సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కినేని నాగార్జున తొలిసారి సాయిబాబా పాత్రలో ఇందులో కనిపించారు.
.jpeg)
12 . శ్రీ మంజునాథ(జూన్ 22 , 2001)
U|157 minutes|డ్రామా,హిస్టరీ
మంజునాథ (అర్జున్) అనే నాస్తికుడు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. అతడు శివుని భక్తురాలైన కాత్యాయిని (సౌందర్య)ని వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత మంజునాథ జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో అతడు శివుడికి పరమభక్తుడిగా మారిపోతాడు. మరి మంజునాథ ఎందుకు మారాడు? మారిన తర్వాత ఏం చేశాడు? అనేది మిగతా కథ.

13 . పిలిస్తే పలుకుతా(అక్టోబర్ 18 , 2002)
UA|ఫాంటసీ,రొమాన్స్
శాంతి, అజయ్ కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే శాంతికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి సాయిబాబా తనను కాపాడతాడని శాంతి నమ్ముతుంది. చివరికీ ఏం జరిగింది? అన్నది కథ.

14 . బ్రో(జూలై 28 , 2023)
UA|హాస్యం,డ్రామా
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథ

15 . పాండురంగ మహత్యం(నవంబర్ 28 , 1957)
U|175 minutes|డ్రామా,హిస్టరీ
ఈ చిత్రం మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర వైభవాన్ని చాటుతుంది. సనాతన సంప్రదాయాల్నీ, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది. నాస్తికుడైన ఒక యువకుడు పాండురంగడుకి పరమభక్తుడిగా ఎలా మారాడో చూపించారు.

16 . అమ్మోరు తల్లి(నవంబర్ 14 , 2020)
U|134 minutes|డ్రామా
భగవతి బాబా (అజయ్ ఘోష్) చేస్తున్న స్కామ్‌కు సంబంధించిన కేసుపై 'ఇ' అనే రిపోర్టర్ పనిచేస్తుంటాడు. ఈ సమయంలో, అతని వంశ దైవం, అమ్మోరు తల్లి(నయనతార) రామస్వామి ముందు కనిపించి అతని జీవితాన్ని మార్చుతుంది.

17 . పాండురంగడు(మే 30 , 2008)
UA|156 minutes|డ్రామా
పుండరీకుడు స్త్రీ లోలుడు. తల్లిదండ్రులు, భార్యను పట్టించుకోకుండా ఓ వేశ్య చుట్టూ తిరుగుతుంటాడు. అయితే ఆమె పుండరీకుడిపై విష ప్రయోగం చేస్తుంది. దాని నుంచి పుండరీకుడు ఎలా బయటపడ్డాడు? తన తప్పు తెలుసుకొని ఏం చేశాడు? అన్నది కథ.

18 . అవతారం(ఏప్రిల్ 18 , 2014)
UA|యాక్షన్,డ్రామా
అక్కమ్మ దేవత తన నలుగురి సోదరిలతో కలిసి గ్రామాన్ని కాపాడుతుంటుంది. రాజేశ్వరి ఈ అక్కమ్మ చెల్లెళ్ళను పూజిస్తూ ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. భూమిపైకి వచ్చిన కర్కోటకుడు అనే రాక్షసుడు సింహరాశిలో పుట్టిన రాజేశ్వరిని చంపాలని చూస్తాడు. అప్పుడు దేవతలు ఏం చేశారు? అన్నది కథ.

19 . నాగ దేవత(జూలై 01 , 2000)
UA|డ్రామా
సాయికుమార్, సౌందర్య, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయి ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హంసలేఖ సంగీతం సమకూర్చారు.