• TFIDB EN
  • Image 1
    Image 2
    Image 3
    Image 4
    అతీంద్రియ శక్తుల ఆధారంగా హారర్ తెలుగు సినిమాలు

    హరర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను అమితంగా భయపెట్టిన టాప్ బెస్ట్ చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో మసూద, ప్రేమకథా చిత్రమ్, భాగమతి, అరుందతి వంటి చిత్రాలు ఉన్నాయి. హరర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలు బాగా నచ్చుతాయి. మీరు ఓలుక్ వేయండి


    1 . దెయ్యం(జూన్ 21 , 1996)
    A|96 minutes|డ్రామా,హారర్
    ఒక కుటుంబం ఫాంహౌస్‌కు షిఫ్ట్‌ అవుతుంది. ఫ్యామిలీలోని బాలుడు ఊహాతీతంగా కొందరితో వ్యక్తులతో మాట్లాడుతుంటాడు. అయితే వారు దయ్యాలని తెలిసాక కథ మలుపు తిరుగుతుంది.
    2 . అరుంధతి(జనవరి 16 , 2009)
    A|131 minutes|హారర్,థ్రిల్లర్
    చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది.
    3 . అమ్మోరు(నవంబర్ 23 , 1995)
    U|124 minutes|ఫాంటసీ,హారర్
    భవాని అమ్మవారి భక్తురాలు. ఓ మాంత్రికుడ్ని జైలుకు పంపుతుంది. బయటకొచ్చిన అతడు ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాడానికి ప్రయత్నిస్తాడు. దీంతో భవాని అమ్మవారి సాయం కోరుతుంది.
    4 . మసూదా(నవంబర్ 18 , 2022)
    A|160 minutes|హారర్
    నాజియా (భాంధవి శ్రీధర్) ఆమె తల్లి నీలం (సంగీత) ఇద్దరు కలిసి జీవిస్తుంటారు. వీరు గోపీ కృష్ణ (తిరువీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే నాజియా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నీలం, గోపిలను షాక్‌కు గురిచేస్తుంది. ఆమెను భూతవైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు. మరి నాజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? అనేది మిగతా కథ.
    5 . కాంచన(జూలై 15 , 2011)
    UA|170 minutes|హారర్,థ్రిల్లర్
    మూడు ఆత్మలు రాఘవ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. దీంతో అతడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇంతకి ఆ ఆత్మలు ఎవరివి? వాటి బారి నుంచి రాఘవ ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
    6 . గంగ(ఏప్రిల్ 17 , 2015)
    UA|164 minutes|హాస్యం,హారర్,థ్రిల్లర్
    రాఘవ గ్రీన్ టీవీలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అదే చానల్‌లో నందినిని ప్రేమిస్తాడు. వారి టీవి ఛానెల్‌ను ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దెయ్యాల మీద ఓ ప్రోగ్రాం తీద్దాం అని భీమిలి బీచ్‌లోని ఓ పాడుబడ్డ బంగాళాలోకి వెళతారు. అక్కడ ఉన్న బీచ్‌లో నందినికి ఒక తాళి బొట్టు దొరుకుతుంది. ఆ తాళిబొట్టు దొరికిన రోజు నుంచీ నందిని లైఫ్‌లో భయానక సంఘటనలు జరుగుతుంటాయి.
    7 . చంద్రముఖి (ఏప్రిల్ 14 , 2005)
    UA|164 minutes|హారర్
    ఒక ఎన్నారై, అతడి భార్య దయ్యాల హెచ్చరికలను పట్టించుకోకుండా తమ పూర్వికుల బంగ్లాలో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇంట్లో దిగగానే వారికి విచిత్రమై పరిస్థితులు ఎదురవుతాయి. మానసిక వైద్యుడైన హీరో ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తాడు.
    8 . రాజు గారి గది 2(అక్టోబర్ 13 , 2017)
    UA|127 minutes|హారర్
    రుద్ర ఓ దెయ్యాల రిసార్ట్‌లో భూతల సమస్యను పరిష్కరించేందుకు వస్తాడు. అక్కడ కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అతనికి న్యాయం కోసం పోరాడుతున్న ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది.
    9 . ప్రేమ కథా చిత్రమ్(జూన్ 07 , 2013)
    UA|130 minutes|డ్రామా,హారర్
    నలుగురు యువకులు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా కలిసి ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. కానీ ఆ ఇంట్లో వారి ప్లాన్లన్నీంటిని కొన్ని సంఘటనలు అడ్డుకుంటాయి. ఎంటా సంఘటనలు? ఇంతకు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనకున్నారన్నది మిగతా కథ.
    10 . భాగమతి(జనవరి 26 , 2018)
    UA|135 minutes|హారర్,థ్రిల్లర్
    మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌ (జయరామ్‌)పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆఫీసర్‌ వైష్ణవి (ఆశా శరత్‌) రంగంలోకి దిగుతుంది. గతంలో ఆయనకు సెక్రటరీగా ఉండి జైలు శిక్ష అనుభవిస్తున్న చంచల (అనుష్క)ను విచారణ నిమిత్తం భాగమతి బంగ్లాకు తీసుకెళ్తుంది. అయితే అది దెయ్యాల బంగ్లా. చంచల ఆ బంగ్లాకు వెళ్లినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మెుదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    11 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    12 . టాక్సీవాలా(నవంబర్ 17 , 2018)
    UA|137 minutes|ఫాంటసీ,థ్రిల్లర్
    శివ (విజయ్‌ దేవరకొండ) ట్యాక్సీ డ్రైవర్‌. ఓ పాత ట్యాక్సీని తక్కువ ధరకే కొనుగోలు చేస్తాడు. కానీ, ఆ కారులో దెయ్యం ఉందని శివ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    13 . రాజు గారి గది 3(అక్టోబర్ 18 , 2019)
    UA|122 minutes|హాస్యం,హారర్
    అశ్విన్, మాయ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకు ఒక ప్రేతాత్మ అడ్డుపడుతోందని తెలుసుకుంటారు. తమ జీవితాన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్న అశ్విన్ ఏం చేశాడు అనేది కథ
    14 . చారులత(సెప్టెంబర్ 20 , 2012)
    UA|హారర్,థ్రిల్లర్
    చారు, లత శరీర భాగాలు అతుక్కొని పుట్టిన కవల సోదరిమణులు. వారిద్దరు రవిని ప్రేమిస్తారు. అయితే రవి చారును ప్రేమిస్తాడు. ఈ క్రమంలో కవల సోదరిలో ఒకరు చనిపోతారు. ఆమె ఎందుకు చనిపోయింది. దయ్యంగా మారి ఏం చేసింది? అన్నది కథ.
    15 . కాష్మోరా(అక్టోబర్ 28 , 2016)
    UA|164 minutes|ఫాంటసీ,హారర్
    కాష్మోరా(కార్తీ) దెయ్యాల వద్దకు తీసుకెళ్లడానికి కొన్ని ప్రత్యేక శక్తులను కలిగి ఉన్నట్లు నటించే ఒక చిన్న దొంగ. అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని మోసం చేసి అతని డబ్బుతో పారిపోతాడు. ఈక్రమంలో ఏడు వందల ఏళ్లనాటి ఓ పాడుబడ్డ దెయ్యాల భవనంలో అతను చిక్కుకుంటాడు.
    16 . శివ లింగ(ఏప్రిల్ 14 , 2017)
    U|156 minutes|డ్రామా
    శివలింగేశ్వర్ (లారెన్స్) సీఐడీ అధికారి. అతనికి ఓ మిస్టరీ హత్య కేసును చేధించే భాద్యతను ప్రభుత్వం అప్పగిస్తుంది. ఈక్రమంలో అతను సత్యభామతో ప్రేమలో పడుతాడు. అయితే ఆమె ఓ ఆత్మ వల్ల పీడించబడుతుంది. ఇంతకు ఆ ఆత్మ ఎవరు? మిస్టరీ హత్య కేసుతో ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
    17 . బెలూన్(డిసెంబర్ 29 , 2017)
    UA|హాస్యం,హారర్
    బెలూన్ అనేది 2017లో విడుదలైన భారతీయ తమిళ భాషా హారర్ థ్రిల్లర్ చలనచిత్రం, సినీష్ రచన మరియు దర్శకత్వం వహించారు మరియు నిర్మాతలు దిలీప్ సుబ్బరాయన్, అరుణ్ బాలాజీ మరియు నందకుమార్. ఈ చిత్రంలో జై త్రిపాత్రాభినయం చేయగా, జననీ అయ్యర్ మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 2016లో నిర్మాణాన్ని ప్రారంభించింది మరియు 29 డిసెంబర్ 2017న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
    18 . పిసాచి(డిసెంబర్ 19 , 2014)
    UA|114 minutes|హారర్,రొమాన్స్
    సిద్దార్ధ్ ఒక వయోలిన్ ప్లేయర్‌గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన భవాని అనే యువతిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతని చేతిలోనే చనిపోతుంది. ఆ సంఘటన వల్ల సిద్ధార్థ్ చాలా క్రుంగిపోతాడు. అయితే భవాని ఆత్మగా మారి అతని ప్లాట్‌కు వస్తుంది. తనను వేదిస్తున్నట్లు భావించిన సిద్ధార్థ్ దెయ్యాన్ని బయటకు పంపాలని నిర్ణయించుకుంటాడు. అసలు భవాని ఆత్మ అతని ప్లాట్‌కు ఎందుకు వచ్చింది? నిజంగానే అతన్ని వేదిస్తుందా? అనేది కథ.
    19 . అన్నాబెల్లె: క్రియేషన్(ఆగస్టు 11 , 2017)
    A|110 minutes|హారర్,మిస్టరీ
    బొమ్మలు తయారు చేసే వ్యక్తి కూతురు చనిపోవడంతో ఆమె ఆత్మను తాను తయారు చేసిన ఓ బొమ్మలో ప్రవేశపెడుతాడు. ఆ బొమ్మ పేరు అన్నాబెల్లె. కొద్ది రోజుల తర్వాత ఆ బొమ్మ వల్ల అనాథాశ్రమానికి చెందిన అనేక మంది బాలికలు బాధితులుగా మారుతారు. మరి ఆ ఆత్మ నుంచి వారు బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
    20 . త్రిపుర(నవంబర్ 06 , 2015)
    A|135 minutes|హారర్,థ్రిల్లర్
    తాను కంటున్న కలలు నిజమవుతున్న నేపథ్యంలో త్రిపురను చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఆమె ఒక రోజు తన కలలో చంపాలని అనుకున్న వైద్యునితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటుంది.
    21 . చంద్రముఖి 2(సెప్టెంబర్ 28 , 2023)
    UA|171 minutes|హాస్యం,హారర్
    రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది.
    22 . రక్ష(సెప్టెంబర్ 19 , 2008)
    U|116 minutes|హారర్,థ్రిల్లర్
    నాస్తికుడైన రాజీవ్‌కు కుమార్తె రక్ష అంటే చాలా ఇష్టం. అయితే రక్ష విచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటుంది. అయితే రక్షకు చేతబడి జరిగిందని తెలిసినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
    23 . నెక్స్ట్ నువ్వే(నవంబర్ 03 , 2017)
    A|144 minutes|హాస్యం,హారర్
    ఆర్థిక సమస్యలతో తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్న కార్తీ తన తండ్రి తన కోసం రిసార్ట్ విడిచిపెట్టాడని తెలుసుకుంటాడు. ఆ రిసార్ట్‌ను తిరిగి తెరచినప్పుడు... అక్కడ ఊహించని సంఘటనలు జరుగుతాయి.
    24 . గృహం(నవంబర్ 03 , 2017)
    A|137 minutes|డ్రామా,హారర్
    ఒక పెళ్లైన యువ జంట పర్వతాల మధ్య ఉన్న ఇంటిలో ఆనందంగా జీవిస్తుంటుంది. వారింటి పక్కకు ఓ కుటుంబం దిగుతుంది. ఆ కుటంబం వల్ల పెళ్లైన యువ జంట ఇబ్బందుల్లో పడుతుంది. భూతవైద్యం వంటి వాటికి దారితీస్తుంది.
    25 . గీతాంజలి మళ్లీ వచ్చింది(ఏప్రిల్ 12 , 2024)
    UA|డ్రామా
    డైరెక్టర్‌ శ్రీను (శ్రీనివాస రెడ్డి) కొత్త సినిమా కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సత్య, అంజలి హీరో హీరోయిన్లుగా సినిమా చేసే ఛాన్స్ వస్తుంది. అయితే నిర్మాత దెయ్యాల కోటగా పేరున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్‌ చేయాలని షరతు విధిస్తాడు. ఇంతకీ, ఆ సంగీత్ మహల్ గతం ఏమిటి? అక్కడ మూవీ టీమ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
    26 . తంతిరం: చాప్టర్ 1: టేల్స్ అఫ్ శివకాశి(అక్టోబర్ 13 , 2023)
    UA|డ్రామా,మిస్టరీ
    భార్యాభర్తల మధ్య ఓ ఆత్మ ప్రవేశిస్తే.. వారి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్న కథాంశంతో తంతిరం సినిమా రూపొందింది. జిన్‌లు అంటే ఎవరు? వారు ఏం కోరుకుంటారు? వంటి అనేక ఆసక్తికర అంశాల సమ్మేళనమే ఈ మూవీ.
    27 . శాపం(మార్చి 19 , 2010)
    UA|136 minutes|డ్రామా
    అమన్ మరియు కాయా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ కుటుంబ శాపం కారణంగా కాయా పెళ్లి చేసుకోలేదని తెలుసుకున్నప్పుడు అమన్ కలత చెందుతారు. అప్పుడు వారు పరిష్కారం కోసం ఒక ప్రొఫెసర్‌ను సంప్రదిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
    28 . స్ట్రాబెర్రీ(సెప్టెంబర్ 11 , 2015)
    UA|140 minutes|హాస్యం,హారర్
    మిలోవినా అనే విద్యార్థి, టాక్సీ డ్రైవర్ అయిన శరవణన్‌కి ఒక దెయ్యం తనతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నట్లు తెలియజేస్తుంది. ఆ దెయ్యం తన మరణానికి కారణమైన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలని శరవణన్‌ను వేడుకుంటుంది.
    29 . ఊరు పేరు భైరవకోన(ఫిబ్రవరి 16 , 2024)
    UA|133 minutes|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
    ప్రేయసి కోసం ఒక పెళ్లిలో నగలు దొంగతనం చేసిన బసవ (సందీప్ కిషన్).. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన గ్యాంగ్‌తో భైరవకోనకు పారిపోతాడు. అయితే ఆ ఊరికి వెళ్లినవారు ఎవరూ ప్రాణాలతో బయటకు వచ్చింది లేదు. మరి అక్కడ బసవకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరి మిస్టరీ ఏంటి? అన్నది కథ.
    30 . రాత్రి(ఫిబ్రవరి 07 , 1992)
    UA|127 minutes|హారర్,మిస్టరీ
    శర్మ కుటుంబం నగరంలో కట్టుకున్న కొత్త ఇంటికి మారుతుంది. ఆ ఇంట్లోకి వచ్చాక వారు వింత సంఘటనలను అనుభవించడం ప్రారంభిస్తారు. వారి కుమార్తె మినీకి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ కుటుంబం పూజారి సహాయం కోరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు మినీకి ఎవరి నుంచి అపాయం పొంచి ఉందన్నది అనేది కథ.
    31 . తంత్ర(మార్చి 15 , 2024)
    A|డ్రామా,హారర్
    రేఖ (అనన్య)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. బాల్య స్నేహితుడు తేజూను ఆమె ఇష్టపడటంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? విగత (వంశీ), రాజేశ్వరి (సలోని) పాత్రలతో రేఖకు సంబంధం ఏంటి? అన్నది కథ.
    32 . ఇంట్లో దెయ్యం నాకేం భయం(డిసెంబర్ 30 , 2016)
    UA|135 mins|హాస్యం,హారర్
    నకిలీ మంత్రగాడైన హీరో డబ్బు కోసం దయ్యం ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ ఇంటికి వెళ్తాడు. దయ్యం అతడ్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది? అన్నది కథ.
    33 . కారా మజాకా(మే 07 , 2010)
    U|డ్రామా
    ఒక దుర్మార్గుడిచే చంపబడిన ఇద్దరు తోబుట్టువుల ఆత్మలుగా మారతారు. తమను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. ఇందులో భాగంగా ఓ ఆత్మ చిన్నారి ఒంట్లోకి దూరగా, మరో ఆత్మ కారులోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీలన్లపై ఆత్మలు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాయి? అన్నది కథ.
    34 . పంచాక్షరి(జూన్ 11 , 2010)
    A|డ్రామా
    వైష్ణవి మరణం గురించి దుర్గాదేవి చెప్పిన జోస్యం నిజం కావడంతో ఆమె భర్త, కూతురు కుప్పకూలిపోతారు. కొన్నాళ్ల తర్వాత, వైష్ణవి భర్త రాజేష్ నగరంలో తన భార్యను పోలిన యువతిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతకు వైష్ణవిని పోలిన అమ్మాయి ఎవరు? అనేది మిగతా కథ.
    35 . ఆవాహం(ఏప్రిల్ 16 , 2010)
    A|110 minutes|హారర్,థ్రిల్లర్
    రాజీవ్‌ తన భార్య, కూతురుతో కలిసి ఓ పెద్ద ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కూతురు రక్ష ఆడుకుంటూ పొరపాటున సమీపంలోని అడవికి వెళ్తుంది. అక్కడ కనిపించిన అనుమానస్పద బొమ్మను ఇంటికి తీసుకువస్తుంది. అప్పటి నుంచి ఇంట్లో విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. ఇంతకీ ఆ బొమ్మలో ఏముంది? దుష్ట శక్తి బారి నుంచి హీరో తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అన్నది కథ.
    36 . శివ గంగ(మార్చి 04 , 2016)
    A|132 Minutes|హారర్,థ్రిల్లర్
    ఒక యువ జంట వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ ఒక వ్యాపారవేత్త అతని అనుచరులు వారిని దారుణంగా చంపుతారు. దీంతో ప్రేమ జంట దెయ్యాలుగా మారి.. వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంది.
    37 . ఆత్మ(మార్చి 22 , 2013)
    UA|డ్రామా,హారర్
    తన కుమార్తె నియాను అతని భార్య మాయకు అప్పగించిన తరువాత, అభయ్ కారు ప్రమాదంలో మరణిస్తాడు. అయినప్పటికీ, అతని ఆత్మ వారి సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని వెంటాడుతుంటుంది. ఇంతకు అభయ్ కారు ప్రమాదంలో చనిపోయాడా? లేక ఎవరైనా అతన్ని చంపారా? అనేది కథ.
    38 . నాయకి(జూలై 15 , 2016)
    UA|హాస్యం,హారర్,థ్రిల్లర్
    సంజయ్ (సత్యం రాజేష్), సంధ్య (సుష్మా రాజ్) దయ్యాల బంగ్లాకు వెళ్ళి అక్కడ చిక్కుకుంటారు. ఆ బంగ్లాలో గాయత్రి (త్రిష) అనే ఓ దయ్యం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గాయత్రి గతం ఏంటి? అన్నది కథ.
    39 . లంక(ఏప్రిల్ 21 , 2017)
    UA|థ్రిల్లర్
    అతీంద్రియ శక్తులు కలిగిన ఒక మహిళ జీవితం చుట్టూ నడిచే కథ ఇది. ఆమె జీవితంలో జరిగే కొన్ని రహస్యమైన సంఘటనలను చూపిస్తుంది.

    @2021 KTree