• TFIDB EN
  • Editorial List
    ‘డబుల్ ఇస్మార్ట్’ కౌంట్ డౌన్ షురూ... RAPO టాప్ 10 యాక్షన్ మూవీస్ లిస్ట్
    Dislike
    400+ views
    12 months ago

    టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని.. పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బాస్టర్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాకు సిక్వేల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పూరిజగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రామ్‌పొత్తినేని పోస్టర్‌ను విడుదల చేశారు. డబుల్ మ్యాడ్‌నెస్‌ను అనుభవించేందుకు కౌంట్ డౌన్ పూర్తయ్యిందంటూ చిత్ర బృందం పోస్టర్‌ను ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. విలన్‌గా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈక్రమంలో రామ్‌పోత్తినేని నటించిన టాప్ యాక్షన్ చిత్రాలు మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ది వారియర్(జూలై 14 , 2022)
    UA|155 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
    స‌త్య (రామ్ పోతినేని) ఐపీఎస్ అధికారి. త‌న కోరిక మేర‌కే క‌ర్నూలుకి డీఎస్పీగా వ‌స్తాడు. గ్యాంగ్‌స్టర్ గురు (ఆది పినిశెట్టి) చేసే అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు యత్నిస్తాడు. ఆ క్రమంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? విజిల్ మ‌హాలక్ష్మి (కృతిశెట్టి)కి సత్యకు ఉన్న సంబంధం ఏంటి? అనేది కథ.
    2 . మస్కా(జనవరి 14 , 2009)
    UA|యాక్షన్
    క్రిష్ ఆడుతూ పాడుతూ కాలం వెళ్లదీసే యువకుడు. డబ్బున్న అమ్మాయిని పెళ్లిచేసుకుని లైఫ్ సెట్ చేసుకోవాలని భావిస్తుంటాడు. అయితే మీనాక్షి అనే అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు అతని కథ మలుపు తిరుగుతుంది.
    3 . మసాలా(నవంబర్ 14 , 2013)
    U|140 minutes|యాక్షన్,హాస్యం
    భీమరాజపురంలో బలరాం (వెంకటేష్) మంచి పేరున్న పెద్ద మనిషి. అతడికి అబద్దం అంటే నచ్చదు. కొన్ని కారణాల వల్ల రెహ్మాన్‌ (రామ్‌) బలరాంకు అబద్దం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    4 . జగడం(మార్చి 16 , 2007)
    A|163 minutes|డ్రామా
    శీను స్థానిక గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఎదుగుతాడు. శీను కారణంగా అతని తమ్ముడు హత్యకు గురికావడంతో పరిస్థితులు ఊహించని మలుపు తిరుగుతాయి.
    5 . ఒంగోలు గిత్త(ఫిబ్రవరి 01 , 2013)
    A|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    ఈ సినిమా కథ వైట్ అనే పాత్రలో రామ్ ఒంగోలు నగరంలోకి వచ్చి, తన తండ్రి మార్కెట్ యార్డ్ బిజినెస్‌ని తిరిగి చేజిక్కించుకుంటాడు. ఈక్రమంలో స్థానిక మాఫియాతో పోరాడి తన తండ్రి ఆశయాన్ని నిలబెడుతాడు.
    6 . రెడ్(జనవరి 14 , 2021)
    UA|146 minutes|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    సిద్ధార్థ్ (రామ్), ఆదిత్య (రామ్) ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరి డీఎన్‌ఏ కూడా ఒకేలా ఉంటుంది. ఈ క్రమంలో ఆకాశ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆకాశ్‌ను హత్య చేసింది ఎవరు? అనేది కథ.
    7 . కందిరీగ(ఆగస్టు 12 , 2011)
    UA|160 minutes|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    శ్రీను - శ్రుతి కాలేజీలో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఓ రోజు అకస్మాత్తుగా రాజన్న శ్రుతిని కిడ్నాప్‌ చేస్తాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని శ్రీనుకి షరతు విధిస్తాడు. అప్పుడు శ్రీను ఏం చేశాడు? అన్నది కథ.
    8 . దేవదాసు(జనవరి 11 , 2006)
    UA|174 minutes|రొమాన్స్
    భానుమతి తండ్రి అమెరికాలో సెనేటర్, ఆమె భారతదేశ పర్యటనలో ఒక పేద యువకుడు దేవదాస్‌తో ప్రేమలో పడుతుంది. కానీ వారి ప్రేమను భానుమతి తండ్రి వ్యతిరేకిస్తాడు. మరి తన ప్రేమను గెలిపించుకునేందుకు దేవదాసు ఏం చేశాడనేది కథ.
    9 . ఇస్మార్ట్ శంకర్(జూలై 18 , 2019)
    A|141 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్‌ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
    10 . స్కంద(సెప్టెంబర్ 28 , 2023)
    UA|167 minutes|యాక్షన్,డ్రామా
    స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది.

    @2021 KTree