• TFIDB EN
  • Editorial List
    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!
    Dislike
    1 Likes 300+ views
    7 months ago

    ఒకప్పుడు వీకెండ్‌ అనగానే ఏ సినిమాను థియేటర్‌లో చూడాలా? అని ప్రేక్షకులు తెగ ఆలోచించేవారు. అయితే ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు/సిరీస్‌లు చూసేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు.. ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . చారి 111(మార్చి 01 , 2024)
    UA|యాక్షన్,హాస్యం
    చారి (వెన్నెల కిషోర్) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఏజెంట్. సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ చేత చివాట్లు తింటుంటాడు. ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ కేసును సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. అతడు ఈ కేసును ఎలా ఛేదించాడు? క్రైమ్‌ వెకనున్న వ్యక్తి ఎవరు? అన్నది కథ.
    2 . కాజల్ కార్తీక(మే 19 , 2023)
    A|డ్రామా
    కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్లి అక్కడ వందేళ్ల నాటి పుస్తకాన్ని చదువుతుంది. అందులోని ఐదు దయ్యాల పాత్రలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన కార్తిక (కాజల్‌) ఎవరు? ఆమె మరణానికి గ్రామస్తులు ఎందుకు కారణమయ్యారు? మిగిలిన నాలుగు దెయ్యాల పాత్రలు ఏంటి? అన్నది కథ.
    3 . యాత్ర 2(ఫిబ్రవరి 08 , 2024)
    UA|డ్రామా
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి రావటానికి గల కారణమేంటి? ఓదార్పు యాత్రకు నాటి నాయకులు సృష్టించిన అడ్డంకులు ఏంటి? వాటిని జగన్‌ ఎలా అధిగమించారు? అన్నది కథ.
    4 . లాల్ సలామ్(ఫిబ్రవరి 09 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులుగా ఉంటారు. కొంత కాలం ఒకే జట్టుకు ఆడినప్పటికీ.. వారిలో ఒకరు కొత్త టీమ్‌ను స్థాపిస్తారు. దీంతో రెండు జట్లు రెండు మతాలకు ప్రాతినిథ్యం వహించడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ ఆ ఇద్దరు క్రికెటర్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. అప్పుడు ముస్లిం క్రికెటర్‌ తండ్రి (రజనీ) ఏం చేశాడు? అన్నది కథ.
    5 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    6 . ప్రేమలు(మార్చి 08 , 2024)
    U|156 minutes|హాస్యం,రొమాన్స్
    స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌.
    7 . గామి(మార్చి 08 , 2024)
    UA|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
    అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.

    @2021 KTree