
అక్కినేని నాగేశ్వర్‌రావు(ANR) సినిమాల్లో టాప్ 15 బెస్ట్ చిత్రాలు
600+ views1 year ago
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటసామ్రాట్‌గా చెరగని ముద్ర వేసిన లెజండరీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. పౌరణికమైనా, సాంఘీకమైనా, భగ్నహృదయ ప్రేమికుడి పాత్రైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. దేవదాసు, ప్రేమ్‌నగర్ వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు నాగేశ్వర్‌రావు తప్ప మరొకరు చేయలేరేమో అన్న భావన కలిగేలా ఉంటాయి. ANR నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాను ఓసారి చూద్దాం.

1 . గాండీవం(ఆగస్టు 18 , 1994)
U|154 minutes|యాక్షన్,డ్రామా
ఒక వ్యక్తి తన శత్రువు వల్ల తప్పుడు కేసులో జైలుకు వెళ్తాడు. విడుదలైన తర్వాత తన మనవరాలి సాయంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు

2 . సీతారామయ్య గారి మనవరాలు(జనవరి 11 , 1991)
U|131 min|డ్రామా
సీతారామయ్య (నాగేశ్వరరావు) ఊరిలో పరువుగల పెద్ద మనిషి. ప్రేమ పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోయిన కుమారుడిపై కోపం పెంచుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత ఊరిలో జరిగే ఓ శుభకార్యానికి మనవరాలు (మీనా) వస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది కథ.

3 . మాయాబజార్(మార్చి 27 , 1957)
U|184 minutes(Telugu)174 minutes(Tamil)|హాస్యం,డ్రామా,మైథలాజికల్
బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

4 . చాణక్య చంద్రగుప్త(ఆగస్టు 25 , 1977)
U|178 minutes|డ్రామా,హిస్టరీ
మౌర్య సామ్రాజ్యానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు.. అలెగ్జాండర్‌ను ఓఢిస్తాడు. ఈ స్టోరీలైన్‌ను ఆధారంగా చేసుకొని సినిమాను రూపొందించారు. యుద్ధంలో చాణిక్యుడు ఎలాంటి పాత్ర పోషించాడు? అన్నది స్టోరీ.

5 . శ్రీ కృష్ణార్జున యుద్ధం(జనవరి 09 , 1963)
U|167 mins|డ్రామా,హిస్టరీ
గంధర్వుడు పుష్పక విమానంలో వెళ్తూ తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంద్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. ఆగ్రహించిన కృష్ణుడు గంధర్వుడ్ని సంహరిస్తానని శపథం చేస్తాడు. దీంతో గంధర్వుడు అర్జునుడి శరణు కోరతాడు. ఇచ్చిన మాట కోసం అర్జునుడు కృష్ణుడితో పోరాడతాడు.

6 . గుండమ్మ కథ(జూన్ 07 , 1962)
U|166 minutes|హాస్యం,డ్రామా
గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు.

7 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.

8 . ఇల్లరికం(మే 01 , 1959)
U|160 minutes|డ్రామా
వేణు అనే పేదవాడు జమీందార్ కూతురు రాధను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఓ వ్యక్తి కారణంగా వేణుకు జమీందార్ ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయి.

9 . మేఘసందేశం(సెప్టెంబర్ 24 , 1982)
U|151 minutes|డ్రామా,మ్యూజికల్
ప్రమాదంలో చనిపోయిన రోజీ శామ్యూల్ తనను ప్రేమిస్తున్నట్లు బాలగోపాల్ తెలుసుకుంటాడు. అయితే, రోజీ దెయ్యంగా మారి అతని ప్రేయసి అంజలిని వేధిస్తుండంటంతో కథ మలుపు తిరుగుతుంది.
.jpeg)
10 . అనార్కలి(ఏప్రిల్ 28 , 1955)
U|153 minutes|డ్రామా,రొమాన్స్
మొఘల్ యువరాజు సలీం.. పర్షియాకు చెందిన నాదిరా అనే అందమైన మహిళతో ప్రేమలో పడతాడు. అక్బర్ చక్రవర్తి నాదిరాకు అనార్కలి అనే బిరుదును ఇచ్చినప్పటికీ అతను తన కొడుకుతో ఆమె సంబంధాన్ని అంగీకరించడు.

11 . దసరా బుల్లోడు(జనవరి 13 , 1971)
U|160 minutes|డ్రామా
రాధ, నిర్మల ఇద్దరూ గోపిని ప్రేమిస్తారు. కానీ గోపికి రాధ మాత్రమే ఇష్టం. వారి మనసులు తెలుసుకున్న నిర్మల వారిద్దరిని కలపాలని నిర్ణయించుకుంటుంది.

12 . ప్రేమ నగర్(సెప్టెంబర్ 24 , 1971)
U|170 minutes|డ్రామా,రొమాన్స్
జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు.

13 . డాక్టర్ చక్రవర్తి(జూలై 10 , 1964)
U|167 minutes|డ్రామా
డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు.
.jpeg)
14 . దేవదాసు(జూన్ 26 , 1953)
U|191 minutes|డ్రామా,రొమాన్స్
దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది.
.jpeg)
15 . ప్రేమాభిషేకం(ఫిబ్రవరి 18 , 1981)
U|147 minutes|డ్రామా,రొమాన్స్
రాజేష్ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.