• TFIDB EN
  • Editorial List
    అఖిల్ అక్కినేని మోస్ట్ పాపులర్ చిత్రాలు
    Dislike
    300+ views
    7 months ago

    అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యంగ్ హీరో అఖిల్ అక్కినేని. నాగార్జున నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెరంగేట్రం చేశాడు. చెసినవి కొన్ని సినిమాలే అయినా నటనపరంగా తనదైన ముద్ర వేశాడు.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మిస్టర్ మజ్ను(జనవరి 25 , 2019)
    UA|145 minutes|హాస్యం,రొమాన్స్
    ఏ అమ్మాయితో సీరియస్ రిలేషన్ షిప్ కొనసాగించని ఓ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. దీంతో అతని జీవితం అనేక మలుపులు తిరుగుతుంది.

    ఈ చిత్రంలో అఖిల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. లవర్ బాయ్‌గా ఆకట్టుకున్నాడు.

    2 . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(అక్టోబర్ 15 , 2021)
    UA|148 minutes|హాస్యం,రొమాన్స్
    హర్ష (అఖిల్‌) ఎంతో మంది పెళ్లి కూతర్లని చూస్తాడు. అందులో ఒకరైన విభ (పూజా హెగ్డే) హర్షకు బాగా నచ్చుతుంది. కానీ విభ రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం ఏమిటి? హర్ష ఆమెను పెళ్లికి ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.

    అఖిల్ అందుకున్న తొలి బ్లాక్ బాస్టర్ హిట్ ఈ చిత్రం. ఈ సినిమా విజయం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    3 . సిసింద్రీ(సెప్టెంబర్ 14 , 1995)
    U|151 minutes|హాస్యం,చిన్నపిల్లల సినిమా
    ఒక ధనిక పారిశ్రామికవేత్త తన బంధువు కంపెనీ నిధులను దుర్వినియోగం చేశాడని గుర్తించి అతడ్ని తొలగిస్తాడు. దీంతో అతడు ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యాపారవేత్త కుమారుడ్ని కిడ్నాప్‌ చేస్తాడు. తెలివిగల ఆ చిన్నారి కిడ్నాపర్లను ఎలాంటి ఇబ్బందులకు గురిచేశాడు అన్నది కథ.

    ఈ చిత్రం అకిల్‌కు ఊహ తెలియని టైంలో నటించాడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది


    @2021 KTree