• TFIDB EN
  • Editorial List
    Allu Arjun Top 10 Movies: బన్నీ హీరోగా చేసిన టాప్‌-10 చిత్రాలు
    Dislike
    1 Likes 2k+ views
    7 months ago

    దేశవ్యాప్తంగా క్రేజ్‌ సొంతం చేసుకున్న టాలీవుడ్‌ నటుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. సోషల్‌ మీడియాలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్‌ ఏ తెలుగు హీరోకు లేదు. గంగోత్రి సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన బన్నీ పలు సూపర్‌ హిట్‌ సినిమాలను తీశారు. తన నటన, డ్యాన్స్‌, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు ఆడియన్స్‌ను మిస్మరైజ్‌ చేశారు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ అల్లుఅర్జున్ చేసిన అత్యుత్తమ చిత్రాల జాబితా మీకోసం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
    U/A|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.

    అల్లుఅర్జున్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన చిత్రం ‘పుష్ప’. 2021లో సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బన్నీని జాతీయస్థాయి నటుడిగా నిలబెట్టింది. ఇందులో బన్నీ నటనకు బాలీవుడ్‌ ఆడియన్స్‌ సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఫహద్‌ ఫాసిల్‌, అనసూయ, సునీల్‌, జగదీష్‌ ప్రతాప్‌ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమాకు పార్ట్‌-2 రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

    2 . వేదం(జూన్ 04 , 2010)
    U/A|135 minutes|డ్రామా
    రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.

    అల్లుఅర్జున్‌ కెరీర్‌లో ‘వేదం’ మరుపురాని చిత్రంగా మిగిలిపోతుంది. ఇందులో బన్నీ నటన హృదయాలను హత్తుకుంటుంది. కేబుల్‌ రాజు పాత్రలో బన్నీ ఒదిగిపోయారు. డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడే యువకుడి పాత్రలో సహజసిద్దంగా నటించారు. కొన్ని సీన్లలో బన్నీ తన నటనతో ఏడిపించేస్తారు కూడా. ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌తో పాటు అనుష్క, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

    3 . ఆర్య(మే 07 , 2004)
    U|151 minutes|డ్రామా,రొమాన్స్
    అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్‌ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.
    4 . అలా వైకుంఠపురములో(జనవరి 12 , 2020)
    U/A|165 minutes|యాక్షన్,డ్రామా
    బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
    5 . సరైనోడు(ఏప్రిల్ 22 , 2016)
    U/A|160 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    హీరో ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వస్తాడు. నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ది చెబుతుంటాడు. ఈ క్రమంలో వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వైరం ధనుష్ (ఆది)ని హీరో ఎలా ఎదిరించాడు? అతడికి హీరోకు మధ్య గొడవేంటి? అన్నది కథ.

    అల్లుఅర్జున్‌ - బోయపాటి శీను కాంబోలో వచ్చిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ ‘సరైనోడు’. ఇందులో బన్నీ తన నటనతో మాస్‌ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా ఫైట్‌ సీన్లలో ఉగ్రరూపం చూపించాడు. బోయపాటి మార్క్‌ డైరెక్షన్‌కు బన్నీ నటన తోడవడంతో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించారు. ఆది పినిశెట్టి, శ్రీకాంత్‌, సాయికుమార్‌, బ్రహ్మానందం, సురేఖ కీలక పాత్రలు పోషించారు.

    6 . రేసు గుర్రం(ఏప్రిల్ 11 , 2014)
    U/A|163 minutes|యాక్షన్,రొమాన్స్
    హీరోకి తన అన్న అంటే అస్సలు పడదు. పోలీసు అధికారైన తన అన్నను ఓ పోలిటిషియన్‌ చంపాలని చూస్తున్నట్లు హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? అన్నను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్లాన్లు వేశాడు? అన్నది కథ.
    7 . జులాయి(ఆగస్టు 08 , 2012)
    U/A|152 minutes|యాక్షన్,హాస్యం
    రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్‌ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
    8 . S/O సత్యమూర్తి(ఏప్రిల్ 09 , 2015)
    U/A|163 minutes|యాక్షన్,డ్రామా
    ఈ సినిమా కథ విరాజ్ ఆనంద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ధనవంతుడైన తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితం మారుతుంది. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ.. బంధాలు, నైతిక విలువల మధ్య నడవడం ప్రారంభిస్తాడు.
    9 . పరుగు(మే 01 , 2008)
    U|169 minutes|రొమాన్స్
    నీలకంఠం పెద్ద కూతురు బాబు అనే కుర్రాడితో వెళ్లిపోతుంది. దీంతో అతడి ఫ్రెండ్స్‌ను నీలకంఠం మనుషులు బందిస్తారు. బందీగా వచ్చిన కృష్ణ నీలకంఠం చిన్న కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    10 . దేశముదురు(జనవరి 12 , 2007)
    U/A|148 minutes|యాక్షన్,రొమాన్స్
    ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే బాలా గ్యాంగ్‌స్టర్ తమ్ముడిని కొట్టి ఇబ్బందుల్లో పడుతాడు. అతని నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. గ్లాంగ్‌ స్టర్‌తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది మిగతా కథ.

    అల్లుఅర్జున్‌ను టాలీవుడ్‌లో మరింత నిలదొక్కుకునేలా చేసిన చిత్రం ‘దేశముదురు’. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బన్నీ చెప్పే డైలాగ్స్‌కు యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ మూవీలో బన్నీకి జంటగా హన్సిక నటించింది. ప్రదీప్‌ రావత్‌, కోవై సరళ, శ్రీనివాసరెడ్డి, అలీ, జీవా ప్రధాన పాత్రలు పోషించారు.


    @2021 KTree