Editorial List
అల్లురామలింగయ్య టాప్ 10 బెస్ట్ సినిమాలు
300+ views8 months ago
తెలుగులో తొలి తరం హాస్య నటుల్లో అల్లు రామలింగయ్య ముఖ్యులు. హాస్యంలో ఆయనది ప్రత్యేక శైలీ. ఆయన హాస్యంతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వేవారు. కూనిరాగాలతో విచిత్రమైన డైలాగ్‌లతో కామెడీ పండించేవారు. ఆయన నటించిన టాప్ 10 చిత్రాలను ఓసారి చూద్దాం.
1 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.
2 . జగదేక వీరుడు అతిలోక సుందరి(మే 09 , 1990)
U|యాక్షన్,ఫ్యామిలీ
నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది.
3 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.
4 . శంకరాభరణం(ఫిబ్రవరి 02 , 1980)
U|143 minutes|మ్యూజికల్
శంకర శాస్త్రి సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీత గాయకుడు, అతన్ని ఒక వేశ్య కుమార్తె తులసి అభిమానిస్తుంది. అతనికి సేవ చేయాలని కోరుకుంటుంది. అయితే ఆమె తల్లి మాత్రం వేశ్యగా మారాలని బలవంతం చేస్తుంది.
5 . అందాల రాముడు(సెప్టెంబర్ 12 , 1973)
U|170 minutes|డ్రామా
ధనిక కుటుంబానికి చెదిన సీత, నిరుపేద అనాథ అయిన రాముతో ప్రేమలో పడుతుంది. వీరి పెళ్లికి సీత తండ్రి ఒప్పుకొనప్పటికీ ఆమె రామును పెళ్లి చేసుకోవడంతో సమస్యలు తలెత్తుతాయి.
6 . మనవూరి పాండవులు(నవంబర్ 09 , 1978)
UA|డ్రామా
గ్రామ పెద్ద ఊరిలోని ప్రజలను పీడిస్తూ వారిని బాధపెడుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఐదుగురు యువకులు ఊరి పెద్దను ఎదిరిస్తారు.
7 . ముత్యాల ముగ్గు(undefined 00 , 1975)
U|165 min|డ్రామా
ముత్యాల ముగ్గు అనేది రమణ మరియు బాపుల రచయిత-దర్శక ద్వయం నుండి ఉత్తర రామాయణం యొక్క 1975 భారతీయ తెలుగు భాషా నాటక చలన చిత్రం. ఈ చిత్రంలో సంగీత, శ్రీధర్, కాంతారావు, రావుగోపాలరావు, ముక్కామల, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ చిత్రం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను కైవసం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. రావు గోపాల్ రావు తన పాత్రకు విస్తృత ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం హిందీలో జీవన్ జ్యోతి (1976)గా రీమేక్ చేయబడింది.
8 . మాయాబజార్(మార్చి 27 , 1957)
U|184 minutes(Telugu)174 minutes(Tamil)|హాస్యం,డ్రామా,మైథలాజికల్
బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
9 . దొంగ రాముడు(అక్టోబర్ 01 , 1955)
U|197 minutes|డ్రామా
తోబుట్టువులైన రాముడు, లక్ష్మి చిన్నతనంలో విడిపోతారు. పెద్దయ్యాక ప్రతీకూల పరిస్థితుల నేపథ్యంలో వారు కలుస్తారు. లక్ష్మిపై హత్యారోపణలు రాగా రాముడు ఆమె నిర్ధోషిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు.
10 . మూగ మనసులు(జనవరి 31 , 1964)
U|160 mins|డ్రామా
కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ కోసం గోదావరిలో పడవ ప్రయాణం చేస్తుండగా వారికి సుడిగుండాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఆ జంటకు గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి.