• TFIDB EN
  • Editorial List
    అల్లు శిరీష్ నటించిన హిట్ చిత్రాలు
    Dislike
    200+ views
    2 months ago

    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైన అల్లు శిరీష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అన్న అల్లు అర్జున్ స్టార్ డం ప్రభావం తనపై లేకుండా నటనలో ప్రత్యేకతను చాటుకున్నాడు. మరి శీరిష్ నటించిన హిట్ చిత్రాలను ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . శ్రీరస్తు శుభమస్తు(ఆగస్టు 05 , 2016)
    U/A|డ్రామా,రొమాన్స్,హాస్యం
    ధనవంతుడు అయిన హీరో పేదింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. సాధారణ అబ్బాయిగా ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    అల్లు శీరిష్‌కు తొలి విజయాన్ని అందించిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా కెరీర్‌లో నిలదొక్కుకోగలిగాడు.

    2 . కొత్త జంట(మే 03 , 2014)
    U/A|హాస్యం,రొమాన్స్
    టీవీ యాంకర్లు అయిన హీరో హీరోయిన్లు తొలి నుంచి గొడవ పడుతుంటారు. కెరీర్‌ కోసం దొంగ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారు ఎలా ప్రేమలో పడ్డారు? అన్నది కథ.
    3 . ఊర్వశివో రాక్షశివో(నవంబర్ 04 , 2022)
    U/A|హాస్యం,రొమాన్స్,డ్రామా
    పెళ్లి బంధం ఎర్పరుచుకోవాలనే మనస్తత్వం ఉన్న అబ్బాయి... కేవలం లివ్‌- ఇన్‌- రిలేషన్‌ షిప్‌తోనే జీవితం సాగించాలనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఆ బంధం ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ

    అల్లు శిరీష్‌కు సూపర్ హిట్ అందించిన చిత్రమిది. ఈ చిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

    4 . గౌరవం(ఏప్రిల్ 19 , 2013)
    U|డ్రామా
    ఇది అర్జున్ అనే యువ లాయర్ జీవిత ప్రయాణాన్ని తెలుపుతుంది. అతను తన ఫ్రెండ్ పెళ్లికి హాజరు ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ మిస్సింగ్ అయ్యాడని తెలుసుకున్న తరువాత, అతను ఆ విషయంపై తనదైన విచారణ చేపట్టి, గ్రామంలోని లోతైన కులవివక్ష, అవినీతిపై పోరాటం చేస్తాడు.
    5 . ABCD: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ(మే 17 , 2019)
    U|హాస్యం,డ్రామా
    అమెరికాలో ధనవంతుడైన అరవింద్‌కు డబ్బు అంటే నిర్లక్ష్యం. దీంతో అతని తండ్రి డబ్బు విలువ తెలియజేయాలని భారతదేశం పంపుతాడు. తొలుత జాలీ ట్రిప్‌గా భావించిన అరవింద్.. అతని తండ్రి డబ్బులు పంపించకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటాడు.

    @2021 KTree