
యానిమల్ రన్‌టైమ్ 3.21 గంటలు.. మరి తెలగులో అత్యధిక రన్‌టైమ్ కలిగిన సినిమా ఏదో తెలుసా
700+ views1 year ago
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్ కపూర్- రష్మిక మంధాన జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఈ సినిమా నిడివి( రన్ టైమ్) 3గంటల 21 నిమిషాలు. అయితే ఈ సినిమా అసలు నిడివి 3.41 గంటలు అంటా. సెన్సార్ బోర్డు కత్తిరుంపులతో నిడివి 3.21గంటలకు చేరింది. దీంతో నెట్టింట్లో ఈ సినిమా రన్‌టైమ్‌పై 'వామ్మో ఇంత రన్‌టైమా?' అంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఇప్పటి వరకు భారీ నిడివితో వచ్చిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1 . మాయాబజార్(మార్చి 27 , 1957)
U|184 minutes(Telugu)174 minutes(Tamil)|హాస్యం,డ్రామా,మైథలాజికల్
బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

2 . పాతాళ భైరవి(మార్చి 15 , 1951)
U|195 minutes|డ్రామా,ఫాంటసీ
ఉజ్జయిని యువరాణి ఇందుమతితో సాధారణ తోటమాలి కొడుకు అయిన తోటరాముడు ప్రేమలో పడుతాడు. ఈ విషయం తెలిసిన మహారాజు అతన్ని మందలిస్తాడు. కానీ తోటరాముడు, యువరాణిని తనతో పెళ్లి చేయాలంటే ఏం కావాలో అడగమని రాజును ఛాలెంజ్ చేస్తాడు. అయితే తన దగ్గర ఉన్న సంపదతో సమానమైన సంపదను తెస్తే పెళ్లి చేస్తానని మహారాజు హామీ ఇస్తాడు. మరి తోటరాముడు అంత ఆస్తిని సంపాదించాడా? లేదా అన్నది మిగతా కథ

3 . లవ కుశ(మార్చి 29 , 1963)
U|208 min|డ్రామా,మ్యూజికల్
రాముడు గర్భవతి అయిన సీతను వనవాసానికి పంపినప్పుడు ఆమె కవల కుమారులకు జన్మనిస్తుంది. వారు పెద్దయ్యాక అశ్వమేధ యజ్ఞానికి అంతరాయం కలిగించడానికి అయోధ్యకు వెళ్లినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.

4 . పాండవ వనవాసం(జనవరి 14 , 1965)
U|198 minutes|డ్రామా
పాండవులు తమ కౌరవులతో జూదంలో ఓడిన తరువాత అడవులకు వెళ్తారు. వనమాసం తర్వాత రాజ్యంలో తమ భాగాన్ని పొందెందుకు దాయాదులతో పాండవులు పోరాడుతారు.

5 . టైగర్ నాగేశ్వరరావు(అక్టోబర్ 20 , 2023)
UA|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
టైగర్ నాగేశ్వరరావు(రవితేజ) అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు అనేది కథ.
.jpeg)
6 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
UA|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.

7 . అర్జున్ రెడ్డి(ఆగస్టు 25 , 2017)
A|182 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.

8 . నువ్వు నాకు నచ్చావ్(సెప్టెంబర్ 06 , 2001)
U|180 minutes|హాస్యం,మ్యూజికల్
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.

9 . ప్రస్థానం(ఏప్రిల్ 16 , 2010)
U|181 minutes|యాక్షన్,డ్రామా
తన తండ్రి, ప్రఖ్యాత రాజకీయ నాయకుడైన తన సవతి సోదరుడు మిత్రా పట్ల చిన్నా నిత్యం అసూయతో ఉంటాడు. చివరికి, మిత్ర జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ దారితప్పిపోతాడు.
.jpeg)
10 . అల్లూరి సీతారామ రాజు(మే 01 , 1974)
U|187 minutes|యాక్షన్,డ్రామా
స్వాతంత్య్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు.. రైతులు, గిరిజనుల పక్షాన నిలబడి బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతాడు. భూమి హక్కులను ఉల్లంఘించిన బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటుకు పిలుపునిస్తాడు.

11 . 7G బృందావన కాలనీ(నవంబర్ 06 , 2004)
U|185 minutes (Tamil) 174 minutes (Telugu)|డ్రామా,రొమాన్స్
పనిపాటలేని రవి అనే వ్యక్తి పక్కింట్లోకి అనిత అనే అమ్మాయి తన కుటుంబంతో మారుతుంది. ఆమెతో రవి ప్రేమలో పడుతాడు. అనిత ఇంప్రెస్ చేసేందుకు రవి తన శక్తిమేర ప్రయత్నించినప్పటకీ విఫలమతుంటాడు. చివరకు రవి తనపై చూపుతున్న ప్రేమకు చలించిన అనిత తాను కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఓ అనుకోని సంఘటన పెద్ద విషాదానికి దారితీస్తుంది.

12 . దాన వీర శూర కర్ణ(జనవరి 14 , 1977)
U|226 minutes|డ్రామా,ఫాంటసీ
కర్ణుడు.. దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు. స్నేహాన్ని గౌరవించడం కోసం చాలా వరకూ వెళ్తాడు. పాండవులతో యుద్ధంలో దుర్యోధనుడికి సాయం చేస్తాడు.

13 . నిజం(మే 23 , 2003)
U|187 minutes|డ్రామా
అమాయకుడైన సీతారాం తండ్రిని కొంతమంది చంపుతారు. అయితే అతని తల్లి, అతని తండ్రి చావుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది.