• TFIDB EN
  • Editorial List
    అంజలిదేవి టాప్ 20 బెస్ట్ చిత్రాలు
    Dislike
    300+ views
    8 months ago

    అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి తెలుగులో తొలితరం అగ్ర కథానాయికల్లో ఒకరు. నిండైన శాంతి మార్తిగా ఆమెను ప్రేక్షకులు భావించేవారు. లవకుశ చిత్రంలో ఆమె చేసిన సీతాదేవి పాత్ర గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో తెరమీద కనిపించినప్పుడు ప్రేక్షకులు అంజలిదేవికి మంగళహారతులు పట్టారు. అంతటి గొప్ప నటి నటించిన టాప్ 20 బెస్ట్ చిత్రాలను ఓసారి చూద్దామా

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . పెద్దరికం(undefined 00 , 1992)
    U|134 minutes|యాక్షన్,డ్రామా
    బసవపున్నమ్మ (భానుమతీ), పరశురామయ్య (ఎన్. ఎన్. పిళ్ళై) కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. దాంతో బసవపున్నమ్మ వారి మీద పగ తీర్చుకోవడానికి జానకి (సుకన్య)ని పరశురామయ్య చిన్న కొడుకు కృష్ణమోహన్ (జగపతి బాబు)ను ప్రేమించినట్లు నాటకమాడమని చెబుతుంది. అయితే వారిద్దరు ఒకర్నొకరు నిజంగానే ఇష్టపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ రెండు కుటుంబాలను కలిపిందా? లేదా? అనేది అసలు కథ.
    2 . బామ్మ మాట బంగారు బాట(మార్చి 09 , 1989)
    U|148 minutes|హాస్యం,డ్రామా
    సూరయ్య (నూతన్ ప్రసాద్), రాజ్యలక్ష్మి (భానుమతి) దంపతుల మనవడైన కృష్ణ (రాజేంద్ర ప్రసాద్) పెద్దలకు ఇష్టం లేకుండానే సీత (గౌతమి)ను ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. తాత, బామ్మల ప్రేమను తిరిగి పొందేందుకు మనవడు పుట్టాడని కృష్ణ అబద్దం చెబుతాడు. ఆ తర్వాత ఏ ఏ పరిణామాలు జరిగాయన్నది అసలు కథ.
    3 . పల్నాటి యుద్ధం(ఫిబ్రవరి 18 , 1966)
    UA|182 mins|డ్రామా,హిస్టరీ
    బ్రహ్మనాయుడు తన కొడుకు కాలజ్ఞానం కారణంగా అతనిని చంపడానికి ప్రయత్నించినప్పుడు అతని బావ రక్షిస్తాడు. కొన్ని ఏళ్ల తర్వాత, అతను తన కొడుకు తిరుగుబాటు నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి బ్రహ్మనాయుడు ఓ కఠిన నిర్ణయం తీసుకుంటాడు.
    4 . బొబ్బిలి యుద్ధం(డిసెంబర్ 04 , 1964)
    U|153 mins|డ్రామా,హిస్టరీ
    బొబ్బిలి సైన్యాధిపతి తాండ్ర పాపారాయుడు తన సోదరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుని విజయనగరం రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు.
    5 . లైలా మజ్ను(అక్టోబర్ 01 , 1949)
    U|169 minutes|డ్రామా,మ్యూజికల్
    ఖయాస్ లైలాతో ప్రేమలో పడతాడు. కానీ ఆమె తండ్రి వారి బందాన్ని నిరాకరిస్తాడు. ఇది ఖయాస్‌ను ఎంతో బాధిస్తుంది. అయితే లైలా మక్కాకు వెళ్లినప్పుడు విషయాలు మలుపు తిరుగుతాయి.
    6 . మిస్సమ్మ(జనవరి 12 , 1955)
    U|181 minutes|డ్రామా,ఫ్యామిలీ,రొమాన్స్
    ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు.
    7 . మల్లీశ్వరి(డిసెంబర్ 20 , 1951)
    U|175–194 minutes|డ్రామా,రొమాన్స్
    రాణి వాసం అంటే అందమైన యువతులు వచ్చి ప్యాలెస్‌లో బస చేయడం, మగవాళ్లను కలవడానికి వీలుండదు. అయితే నాగరాజును గాఢంగా ప్రేమిస్తున్న మల్లీశ్వరి తనకు ఇష్టం లేకున్న రాణివాసం వెళ్లాల్సి వస్తుంది. ఈక్రమంలో వేరుపడిన నాగరాజు, మల్లీశ్వరి విరహ వేదనను అనుభవిస్తారు.
    8 . భక్త తుకారాం(జూలై 05 , 1973)
    U|166 mins|డ్రామా
    తుకారాం ఒక చిన్న వ్యాపారి, దేవునిపై విశ్వాంతో పవిత్రమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఈక్రమంలో అతను అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ భగవంతుడిపై స్థిరమైన నమ్మకంతో ముందుకు సాగుతాడు.
    9 . భీష్మ(ఏప్రిల్ 19 , 1962)
    U|165 minutes|డ్రామా,మ్యూజికల్
    పాండవులు, కౌరవులకు సమన్యాయం చేయడానికి భీష్ముడు సాధ్యమైనంత ప్రయత్నిస్తాడు. సయోధ్యను కుదర్చడంలో భీష్మ విఫలమైనప్పుడు దాయాదుల మధ్య వివాదం రాజుకుంటుంది.
    10 . జయభేరి(ఏప్రిల్ 09 , 1959)
    U|110 minutes|డ్రామా
    సంగీత శాస్త్ర కోవిదుడైన విశ్వనాథుడు వద్ద అతని తమ్ముడు కాశీనాథ్(అక్కినేని) సంగీతం నేర్చుకుని గురువును మించిన శిష్యుడు అవుతాడు. బచ్చెన భాగవతుల ప్రదర్శన చూడడానికి వెళ్ళిన కాశీనాథ్.. ఆ ప్రదర్శనలో ప్రధాన పాత్ర వహించి, సవాలు చేసిన మంజుల (అంజలీదేవి)తో ప్రతిసవాలు చేస్తాడు. వారిద్దరి మధ్యా జరిగిన సంగీతపరమైన వివాదం ప్రేమకు దారితీస్తుంది. పెద్దలను ఎదురించి మంజులను కాశీనాథ్ పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది.
    11 . పల్లెటూరి పిల్ల(ఏప్రిల్ 27 , 1950)
    UA|176 minutes|యాక్షన్,డ్రామా
    జయంత్ అనే అధికారి తన ఆదీనంలో ఉన్న ప్రాంతంలోని ప్రజలు పీడిస్తుంటాడు. ఆ ప్రాంతంలో ప్రజల వద్ద ఉన్న ఆహారం, సంపదపై దాడులు చేసి దోచుకుంటాడు. ఓసారి శాంత అనే యువతి చెంపదెబ్బ కొట్టినప్పుడు, అతని జీవిత దృక్పథం మొత్తం మారిపోతుంది.
    12 . బడి పంతులు(నవంబర్ 22 , 1972)
    U|165 minutes|డ్రామా
    పదవీ విరమణ తర్వాత, రాఘవరావు అతని భార్య పిల్లల చేత కష్టాలు పడుతారు. అతని పిల్లలు ఇంటిని అమ్మి భార్యభర్తలను వేరు చేసి రొటేషన్‌ విధానంలో వారికి ఆశ్రయం కల్పిస్తూ అవమానిస్తారు.
    13 . భక్త ప్రహ్లాద(జనవరి 12 , 1967)
    U|డ్రామా,మ్యూజికల్
    భక్త ప్రహ్లాద 1967లో డి.వి. నరస రాజు స్క్రిప్ట్ ఆధారంగా చిత్రపు నారాయణరావు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా హిందూ పౌరాణిక చిత్రం. ఇందులో ఎస్‌వి రంగారావు మరియు అంజలీ దేవి నటించారు. రోజా రమణి తన తొలి చలనచిత్రంలో టైటిల్ క్యారెక్టర్‌ను పోషించింది. s, M. మురుగన్, M. కుమరన్ మరియు M. శరవణన్. ఈ చిత్రం హిందూ దేవుడు విష్ణువు పట్ల భక్తికి ప్రసిద్ధి చెందిన భాగవత పురాణంలో ఒక పాత్ర అయిన ప్రహ్లాద పురాణం ఆధారంగా రూపొందించబడింది.
    14 . శ్రీ లక్ష్మమ్మ కథ(ఫిబ్రవరి 26 , 1950)
    UA|డ్రామా
    ధనిక భూస్వామి కుమార్తె అయిన లక్ష్మమ్మ, తన భర్తతో అనేక ఇబ్బందులు పడుతుంది. రాజ నర్తకి రంగసాని మాయలో పడి ఆమె నగలన్ని దొంగిలిస్తాడు. లక్ష్మమ్మను తీవ్రంగా హింసించడంతో ఆమె తన అత్తగారింటికి వెళ్తుంది. కానీ అక్కడ ఆమె కష్టాలు రెట్టింపవుతాయి.
    15 . చెంచు లక్ష్మి(ఏప్రిల్ 09 , 1958)
    U|145 minutes|డ్రామా,మైథలాజికల్
    హిరణ్యకశిపుని చంపిన తర్వాత విష్ణువు నరసింహ రూపాన్ని ధరించి అడవికి వెళ్తాడు. అక్కడ ఒక గిరిజన పెద్ద కుమార్తె మహాలక్ష్మిని కలుస్తాడు. ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు.
    16 . కీలు గుర్రం(ఫిబ్రవరి 19 , 1949)
    U|172 minutes|డ్రామా
    ఒక యువరాజు తన తండ్రి సైన్యంలో సేనానిగా చేరతాడు. మాంత్రిక శక్తులు ఉన్న తన గుర్రం సహాయంతో రాక్షసుడ్ని చంపడానికి బయలుదేరతాడు.
    17 . అనార్కలి(ఏప్రిల్ 28 , 1955)
    U|153 minutes|డ్రామా,రొమాన్స్
    మొఘల్ యువరాజు సలీం.. పర్షియాకు చెందిన నాదిరా అనే అందమైన మహిళతో ప్రేమలో పడతాడు. అక్బర్ చక్రవర్తి నాదిరాకు అనార్కలి అనే బిరుదును ఇచ్చినప్పటికీ అతను తన కొడుకుతో ఆమె సంబంధాన్ని అంగీకరించడు.
    18 . సువర్ణ సుందరి(మే 10 , 1957)
    U|208 minutes|డ్రామా,మ్యూజికల్
    ఒక దేవదూత, మానవ రాకుమారుడు ప్రేమలో పడతాడు. కాని ఇంద్రుని శాపం వారిని వేరు చేస్తుంది. తిరిగి ఒక్కటయ్యే క్రమంలో వారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి.

    @2021 KTree