• TFIDB EN
  • Editorial List
    August Ott Movies: ఆగస్టు, జులైలో ఓటీటీల్లో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ ఇదే
    Dislike
    50+ views
    25 days ago

    ఆగస్టు, జులై నెలలో వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలు మిస్‌ అయిన వారు ఓటీటీలో వీటిని నేరుగా వీక్షించవచ్చు. స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంతో పాటు ఆ సినిమాల స్టోరి కూడా మీకోసం అందిస్తున్నాం. మరి మీ అభిరుచికి తగ్గ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . శాఖహారి(ఫిబ్రవరి 16 , 2024)
    UA|146 minutes|మిస్టరీ
    సుబ్బన్న ఓ టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుంటాడు. ఓ రోజు విజయ్‌ అనే ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకొని గాయాలతో సుబ్బన్న దగ్గరకు వస్తాడు. అతడి వద్ద ఆశ్రయం పొందుతూ చనిపోతాడు. మరోవైపు అతడ్ని వెతుక్కుంటా ఎస్సై మల్లిఖార్జున వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? శవాన్ని కనిపించకుండా సుబ్బన్న ఏం చేశాడు? అసలు విజయ్‌కు జరిగిన అన్యాయం ఏంటీ? సుబ్బన్న ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
    2 . రాజు యాదవ్(మే 24 , 2024)
    UA|డ్రామా
    రాజు యాదవ్‌ (గెటప్‌ శ్రీను).. క్రికెట్ ఆడుతూ గాయపడతాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల స్మైలింగ్‌ డిజార్డర్‌ బారిన పడతాడు. దాని వల్ల రాజు తన నవ్వుపై నియంత్రణ కోల్పోతాడు. సందర్భంతో సంబంధం లేకుండా నవ్వుతూనే ఉంటాడు. దాని వల్ల రాజుకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    3 . ది గోట్ లైఫ్ (మార్చి 28 , 2024)
    UA|173 minutes|అడ్వెంచర్,డ్రామా
    నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
    4 . హాట్‌ స్పాట్‌(మార్చి 29 , 2024)
    A|హాస్యం
    నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్‌ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
    5 . ధూమం(జూన్ 23 , 2023)
    UA|142 minutes|థ్రిల్లర్,డ్రామా
    అవినాష్ ఓ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేస్తాడు. ఈ క్రమంలో యజమానితో భేదాభిప్రాయాలు రావడంతో కంపెనీ నుంచి బయటకు వస్తాడు. ఓ రోజు కారులో తన భార్యతో వెళ్తున్న క్రమంలో అతనిపై కొంతమంది దాడి చేస్తారు. ఇంతకు అతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అవినాష్ భార్యకు వచ్చిన ప్రమాదం ఏమిటన్నది మిగతా కథ.
    6 . మహారాజా(జూన్ 14 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    మ‌హారాజా ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకొని ఊరి చివర కూతురితో జీవిస్తుంటాడు. ఒక రోజు మ‌హారాజా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు. ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేశార‌ని చెప్తాడు. త‌న బిడ్డను కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తాడు ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? విలన్లపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ.
    7 . అహం రీబూట్(జూన్ 30 , 2024)
    UA|డ్రామా
    ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    8 . తెప్ప సముద్రం(ఏప్రిల్ 19 , 2024)
    UA|క్రైమ్,మిస్టరీ,థ్రిల్లర్
    తెప్ప సముద్రం అనే గ్రామంలో స్కూల్‌ పిల్లలు మాయమవుతుంటారు. దీనిని కనిపెట్టేందుకు ఎస్సై గణేష్‌ (చైతన్య రావు) రంగంలోకి దిగుతాడు. మరోవైపు రిపోర్టర్‌ ఇందు (కిశోరి ధాత్రిక్‌) కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో వారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి? ఆ వాస్తవాలు ఏంటి? గణేష్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? అన్నది స్టోరీ.
    9 . టర్బో(మే 23 , 2024)
    UA|155 minutes|యాక్షన్,హాస్యం,డ్రామా
    ట‌ర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవ‌ర్‌. స్నేహితుడు జెర్రీ ప్రేమను గెలిపించే క్రమంలో ఓ యువతిని ఎత్తుకొస్తాడు. పోలీసులు కేసుపెట్టడంతో చెన్నైకి పారిపోతాడు. కట్‌ చేస్తే జెర్రీని ఓ గ్యాంగ్‌స్టర్‌ మనుషులు హత్య చేస్తారు. అతడి ప్రేయసిని చంపేందుకు యత్నిస్తారు. ఆమెను జోస్‌ ఎలా కాపాడాడు? జెర్రీని ఆ గ్యాంగ్‌స్టర్‌ ఎందుకు చంపాడు? స్నేహితుడి చావుకి జోస్‌ ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
    10 . భారతీయుడు 2 (జూలై 12 , 2024)
    UA|డ్రామా,యాక్షన్
    దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సిద్ధార్థ్‌ తన ఫ్రెండ్స్‌తో సోషల్‌ మీడియాలో పోరాటం చేస్తాడు. సేనాపతి తిరిగి రావాలని హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తారు. దీంతో ఇన్నేళ్ల తర్వాత సేనాపతి మళ్లీ ఇండియాకు వస్తాడు. అలా వచ్చిన సేనాపతి అవినీతి, లంచగొండితనంపై ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది కథ.
    11 . డార్లింగ్(జూలై 19 , 2024)
    UA|హాస్యం,రొమాన్స్
    రాఘవ్‌ (ప్రియదర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్‌ అంటూ కలలు కంటాడు. భార్యను తీసుకొని హనీమూన్‌కు పారిస్‌ వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ‌అతడి లైఫ్‌లోకి మల్టిపుల్‌ స్ప్లిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆనంది (నభా నటేష్‌) వస్తుంది. ఆమెతో రాఘవ్‌ ఎన్ని తిప్పలు పడ్డాడు? అన్నది కథ.
    12 . వీరాంజనేయులు విహార యాత్ర(ఆగస్టు 14 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    నాగేశ్వరరాలు (నరేశ్‌) మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం పోవడం, కూతురు పెళ్లి ఫిక్స్‌ కావడంతో అతడికి డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో తన తండ్రి వీరాంజనేయులు గోవాలో కొన్న ఇంటికి సంబంధించి రూ.60 లక్షల ఆఫర్‌ వస్తుంది. దీంతో ఇంటిని అమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి గోవాకు బయల్దేరుతారు. ఈ ప్రయాణం నాగేశ్వరరావు ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపింది? అన్నది స్టోరీ. వీరంజనేయులు విహారయాత్ర చిత్రం ఆగస్టు 14న ఈటీవీ విన్‌ ఓటీటీలో విడుదలైంది.
    13 . ఎవోల్(ఆగస్టు 15 , 2024)
    A|డ్రామా
    ఇద్దరు స్నేహితులతో ఓ అమ్మాయి ఒకేసారి ప్రేమలో పడుతుంది. వారికి శారీరకంగా దగ్గరవుతుంది. ఆయితే ఆ ఇద్దరిని ఆమె నిజంగానే ప్రేమించిందా? లేదా ట్రాప్‌ చేసిందా? ఈ లవ్‌ స్టోరీ చివరికీ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్నది స్టోరీ.
    14 . గర్ర్(జూన్ 14 , 2024)
    UA|డ్రామా
    ఒక తాగుబోతు వ్యక్తి ఓ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశిస్తాడు. దీంతో అతన్ని రక్షించేందుకు సెక్యురిటీ గార్డ్‌ రంగంలోకి దిగుతాడు. వారిద్దరు ఆ సింహాం బారి నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అన్నది స్టోరీ.
    15 . రాయన్ (జూలై 26 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో జీవిస్తుంటాడు. పెద్ద తమ్ముడు ముత్తువేల్‌ (సందీప్‌ కిషన్‌) ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ సమస్యలు తెస్తుంటాడు. ఆ ఊళ్ళో దొరై (శరవణన్), సీతారాం (ఎస్‌.జే. సూర్య) అనే ఇద్దరు రౌడీలు ఉండగా ఓ రోజు దొరై అనూహ్యంగా చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారాం టార్గెట్‌ చేస్తాడు. దొరైని చంపింది ఎవరు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.
    16 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
    UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
    కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్‌ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
    17 . తూఫాన్(ఆగస్టు 09 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    సలీం (విజయ్‌ ఆంటోని) ఇండియన్‌ సీక్రెట్‌ ఏజెన్సీలో ఏజెంట్‌గా చేస్తుంటాడు. ఏకాంతంగా గడిపేందుకు అండమాన్‌ ద్వీపానికి వస్తాడు. ఓ శునకాన్ని కాపాడే క్రమంలో అతడికి సౌమ్య (మేఘా ఆకాశ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే సౌమ్యకు స్థానిక వడ్డీ వ్యాపారి డాలి నుంచి సమస్యలు ఎదరవుతుంటాయి. ఇంతకీ ఏంటా ఆ సమస్య? ఆమెకు సలీం ఎలా అండగా నిలిచాడు? డాలిని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.

    @2021 KTree