• TFIDB EN
  • Editorial List
    బాలకృష్ణ కెరీర్‌లో బెస్ట్‌ కామెడీ సినిమాలు
    Dislike
    20+ views
    1 month ago

    నందమూరి బాలకృష్ణ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసి అప్రతిహతంగా సాగిపోతున్నాడీ నటసింహం. నటనకు మారుపేరు బాలయ్య. పాత్ర ఏదైనా అవలీలగా చేసేస్తారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోశారు. కేవలం యాక్షన్, ఫ్యామిలీ చిత్రాలకే కాకుండా తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ప్రేక్షకాదరణ కోణంలో బాలయ్య బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . భలే దొంగ(ఫిబ్రవరి 10 , 1989)
    U|151 minutes|యాక్షన్
    సురేంద్ర.. నగరాన్ని శాసిస్తున్న విధాతను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. ఆ డబ్బుతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతుంటాడు. అతడ్ని పట్టుకునేందుకు ఎస్పీ ఇంద్రాణి రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    2 . అనసూయమ్మ గారి అల్లుడు(జూలై 02 , 1986)
    U|143 minutes|హాస్యం
    సంపన్న కుటుంబానికి చెందిన అహంకార అమ్మాయి రుక్మిణి మెకానిక్ అయిన హరికృష్ణతో ప్రేమలో పడుతుంది. అయితే హరికృష్ణ రుక్మిణి తల్లి తన తల్లి జీవితాన్ని నాశనం చేసిన తన మేనత్త అని తెలుసుకుంటాడు.
    3 . నారీ నారీ నడుమ మురారి(ఏప్రిల్ 25 , 1990)
    U|138 minutes|హాస్యం,రొమాన్స్
    వీరా తన కూతుళ్లలో ఒకరిని మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసి రెండు కుటుంబాలను కలపాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇద్దరు అమ్మాయిలు మేనల్లుడితో ప్రేమలో పడినప్పుడు గందరగోళం ఏర్పడుతుంది.
    4 . భానుమతి గారి మొగుడు(నవంబర్ 18 , 1987)
    U|145 minutes|డ్రామా
    డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్లిన జయకృష్ణ.. ధనవంతురాలు, అహంకారి అయిన భానుమతిని కలుస్తాడు. ఆమె తన భర్తలా నటించడానికి అతనిని నియమించుకుంటుంది. అయితే వారిద్దరు ఒకరికొకరు ప్రేమలో పడినప్పుడు వారి జీవితాలు మారుతాయి.
    5 . బంగారు బుల్లోడు(సెప్టెంబర్ 03 , 1993)
    UA|143 minutes|డ్రామా,రొమాన్స్
    రాణి తన బావ బాలయ్యను గాఢంగా ప్రేమిస్తుంది. కానీ అతను ప్రియతో ప్రేమలో పడుతాడు. దీంతో రాణికి అసూయ కలగడంతో పాటు బాలయ్య ప్రేమ కోసం ప్రియతో పోటీపడుతుంది.
    6 . ఆదిత్య 369(జూలై 18 , 1991)
    U|141 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ
    7 . గాండీవం(ఆగస్టు 18 , 1994)
    U|154 minutes|యాక్షన్,డ్రామా
    ఒక వ్యక్తి తన శత్రువు వల్ల తప్పుడు కేసులో జైలుకు వెళ్తాడు. విడుదలైన తర్వాత తన మనవరాలి సాయంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు
    8 . లయన్(మే 14 , 2015)
    UA|156 mins|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    బాలకృష్ణ సిన్సియర్ ప్రభుత్వ అధికారి మరియు పోలీస్ అధికారిగా డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. రాజకీయ వ్యవస్థలోని అవినీతిని గుర్తించి, పోరాడతారు. ఈక్రమలో పలు సవాళ్లు ఎదుర్కొంటారు.
    9 . గొప్పింటి అల్లుడు(జూలై 21 , 2000)
    U|160 minutes|డ్రామా
    మురళి ( బాలకృష్ణ) పారిశ్రామికవేత్త ఎస్వీఆర్ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కుమారుడు. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత స్టేట్స్ నుండి ఇండియా వస్తాడు. ఎస్వీఆర్ తన కోసం జిడ్డు బాలమణి (సాధిక) అనే అమ్మాయిని ఫిక్స్ చేసి ఆమెను పెళ్ళి చేసుకోమని కోరుతాడు. ఆ పెళ్ళి నుంచి బయటపడటానికి, మురళి తిరిగి స్విట్జర్లాండ్‌కు పారిపోతాడు. అక్కడ సౌమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు.
    10 . సింహం నవ్వింది(మార్చి 03 , 1983)
    U|128 minutes|హాస్యం
    పెళ్లిని ద్వేషించే నరసింహం వద్ద బాలకృష్ణ, రాధ పనిచేస్తుంటారు. అయితే తమకు పెళ్లికాలేదని నరసింహానికి అబద్దం చెబుతారు. అయితే ఆ నిజాన్ని దాచేందుకు నానాతంటాలు పడుతారు.
    11 . భలేవాడివి బాసు(జూన్ 15 , 2001)
    U|156 minutes|హాస్యం,ఫ్యామిలీ
    ఒక మంచి పనికోసం ప్రభు ఫారెస్ట్ రేంజర్ సాగర్‌గా మారువేషంలో వస్తాడు. అయితే, అతని గుర్తింపు వెల్లడైనప్పుడు, అతను తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
    12 . పరమ వీర చక్ర(జనవరి 12 , 2011)
    UA|యాక్షన్,డ్రామా
    మేజర్‌ జయసింహా క్రూరమైన ఉగ్రవాదిని పట్టుకుంటాడు. అయితే ఉగ్రవాదులు, కొందరు ఆర్మీ అధికారులు పన్నిన కుట్రకు బలై ఆస్పత్రిలో చేరతాడు. అతడిలాగే ఉండే చక్రధర్‌ జయసింహా స్థానంలోకి వస్తాడు. అప్పుడు చక్రధర్ ఏం చేశాడు? అన్నది కథ.
    13 . లక్ష్మీ నరసింహ(జనవరి 14 , 2004)
    U|185 minutes|డ్రామా
    లక్ష్మీ నర్సింహ అనే పోలీస్ ఆఫీసర్ విజయవాడకు బదిలీ అవుతాడు. అక్కడ ధర్మ బిక్షం చేసే నేరాలను కప్పిపుచ్చేందుకు లంచం తీసుకుంటాడు. అలా తీసుకున్న డబ్బును లక్ష్మీ నరసింహా ఓ పనికోసం ఉపయోగిస్తాడు.
    14 . భైరవ ద్వీపం(ఏప్రిల్ 14 , 1994)
    U|162 minutes|యాక్షన్,అడ్వెంచర్
    ఒక అబ్బాయిని అతని తల్లి అడవిలో పోగొట్టుకున్న తర్వాత ఒక గ్రామ ప్రధానాధికారి చేత పెంచబడతాడు. కాలం గడిచేకొద్దీ, అతను పెద్దవాడై ఒక రాజకుమారి ప్రేమలో పడతాడు. మంత్రగాడి మాయతో బాధపడుతున్న ఆమెను రక్షించాలని నిర్ణయించుకుంటాడు.
    15 . అల్లరి పిడుగు(అక్టోబర్ 05 , 2005)
    U|171 minutes|డ్రామా
    రంజిత్‌, గిరి కవల సోదరులు. రంజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ అయ్యి క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతుంటాడు. గిరి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. జీకే అనే డాన్‌.. రంజిత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు గిరి తన సోదరుడితో కలుస్తాడు.
    16 . అధినాయకుడు(జూన్ 01 , 2012)
    A|151 mins|యాక్షన్,రొమాన్స్
    హరిశ్చంద్ర ప్రసాద్ రాయలసీమలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. దీన్ని అడ్డుకునేందుకు విలన్లు కుట్రలు పన్నుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    17 . భగవంత్ కేసరి(అక్టోబర్ 19 , 2023)
    UA|యాక్షన్,డ్రామా
    కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఏం చేశాడు? ఆమెను స్ట్రాంగ్‌ చేసేందుకు ఏలాంటి పనులు చేశాడన్నది మిగతా కథ
    18 . పైసా వసూల్(సెప్టెంబర్ 01 , 2017)
    UA|142 minutes|యాక్షన్,డ్రామా
    గూఢచార సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి ఒక మాఫియా నాయకుడిని పట్టుకోవడానికి ఒక పెద్ద మిషన్ కోసం స్థానిక గ్యాంగ్‌స్టర్‌ని నియమిస్తాడు. మరి ఆ గ్యాంగ్ స్టార్‌ మాఫియా డాన్‌ను పట్టుకున్నాడా? లేదా అనేది కథ.

    @2021 KTree