• TFIDB EN
  • Editorial List
    Balakrishna Top 10 Movies: బాలకృష్ణ టాప్ 10 ఉత్తమ చిత్రాలు
    Dislike
    2k+ views
    11 months ago

    నందమూరి బాలకృష్ణ.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసి అప్రతిహతంగా సాగిపోతున్నాడీ నటసింహం. నటనకు మారుపేరు బాలయ్య. పాత్ర ఏదైనా అవలీలగా చేసేస్తాడు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోశాడు. ప్రయోగాత్మక నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. వేశం వేసినా, డైలాగ్ చెప్పినా అది గుర్తుండిపోవాల్సిందే. ప్రేక్షకుల మనసులో నాటుకు పోవాల్సిందే. ఇలా వచ్చిన సినిమాల్లో ఉత్తమమైనవి ఎంచుకోవడం కాస్త కష్టమే. నటన, ప్రేక్షకాదరణ కోణంలో బాలయ్య బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మంగమ్మగారి మనవడు(సెప్టెంబర్ 07 , 1984)
    U|129 minutes|యాక్షన్,డ్రామా
    వీరన్న, మల్లి ఒకరికొకరు ప్రేమలో పడతారు. అయితే ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అడ్డుపడతాయి. అనేక సంఘటనల తర్వాత వీరన్న అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచివెళ్తాడు. ఊహించని విధంగా మరో మహిళతో ఊరిలో అడుగుపెడతాడు.
    2 . ముద్దుల మావయ్య(ఏప్రిల్ 07 , 1989)
    UA|138 minutes|డ్రామా
    రాజా తన సోదరి లక్ష్మీ ( సీత ) కోసం మాత్రమే జీవిస్తున్న అనాథ. ఆమె చిన్నాను ప్రేమించడంతో రాజా వారికి పెళ్లి చేస్తారు. అయితే విలన్‌ కొడుకు అయిన చిన్నా.. లక్ష్మీని కత్తితో పొడిచి చంపుతాడు. ఆ తర్వాత రాజా ఏం చేశాడు? అన్నది కథ.
    3 . ముద్దుల కృష్ణయ్య(ఫిబ్రవరి 28 , 1986)
    UA|133 minutes|యాక్షన్,మ్యూజికల్
    ఊరిలో ధైర్యవంతుడైన కృష్ణయ్య.. పొగరుగా ప్రవర్తించే సంపన్నురాలైన ఓ మహిళ అతని కూతురితో గొడవపడుతాడు. అయితే విబేధాలను పరిష్కరించేందుకు తన కూతురుని పెళ్లి చేసుకోవాలని సంపన్నురాలైన మహిళ భర్త కృష్ణయ్యకు సూచిస్తాడు.
    4 . చెన్నకేశవ రెడ్డి(సెప్టెంబర్ 25 , 2002)
    UA|145 minutes|యాక్షన్,డ్రామా
    చెన్నకేశవ రెడ్డి 22 ఏళ్లుగా చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. ఓ జైలర్‌ సాయంతో విడుదలై తనను ఇరిక్కించిన వారిపై పగ తీర్చుకునేందుకు రాయలసీమకు వెళ్తాడు. పోలీసు అయిన చెన్నకేశవ రెడ్డి కుమారుడు తండ్రి నేర కార్యక్రమాలకు అడ్డు తగులుతుంటాడు. తన తండ్రి గతం తెలుసుకొని చివరికీ అతడికి సాయం చేస్తాడు.
    5 . దేశోద్ధారకుడు(ఆగస్టు 07 , 1986)
    UA|150 minutes|డ్రామా
    ధర్మారాయుడు, నరసింహ నాయుడు అనే ఇద్దరు దుర్మార్గుల వల్ల ఒక ఊరు నాశనమవుతుంది. అయితే ఆ ఊరికి పొరపాటున వచ్చిన గోపిని ప్రత్యేక అధికారి అని అందరు భయపడుతారు. ఊరిలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేకాధికారిగా కొనసాగాలని గోపిని, విజయ అభ్యర్థిస్తుంది.
    6 . పెద్దన్నయ్య(జనవరి 10 , 1997)
    U|146 minutes|డ్రామా
    రామకృష్ణ ప్రసాద్‌ తన తమ్ముళ్లందరినీ సెటిల్‌ చేయాలని ఆకాంక్షిస్తుంటాడు. అతడి చిన్న తమ్ముడు ఓ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
    7 . సింహ(ఏప్రిల్ 30 , 2010)
    A|156 minutes|యాక్షన్
    శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్. అతని కాలేజీలోకి జానకి అనే యువతి కొత్తగా చేరుతుంది. శ్రీమన్నారాయణను చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడుతుంది. అయితే జానకి గతం.. శ్రీమన్నారయణ తండ్రి గతంతో లింక్ అయి ఉంటుంది. ఇంతకు జానకి ఎవరు? శ్రీమన్నారాయణ తండ్రి గతం ఏమిటి అన్నది మిగతా కథ.

    వైద్యుడిగా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రలు సమర్థవంతంగా పోషించాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా నటించాడు. ఎమోషన్స్, డైలాగ్స్ ఇరగదీశాడు.

    8 . భలే దొంగ(ఫిబ్రవరి 10 , 1989)
    U|151 minutes|యాక్షన్
    సురేంద్ర.. నగరాన్ని శాసిస్తున్న విధాతను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. ఆ డబ్బుతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కడుతుంటాడు. అతడ్ని పట్టుకునేందుకు ఎస్పీ ఇంద్రాణి రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    మోసగాళ్లను మోసం చేసే సూర్య పాత్రలో ఈ సినిమాలో అలరించాడు బాలయ్య. వేషాలు మార్చుతూ విలన్‌ని బురిడీ కొట్టించే తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

    9 . సమరసింహా రెడ్డి(జనవరి 13 , 1999)
    UA|148 minutes|యాక్షన్,డ్రామా
    సమరసింహారెడ్డి తన కుటుంబ హత్యకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అనుకోకుండా వాసు అనే అమాయకుడిని చంపేస్తాడు. ఓ అబద్దంతో వాసు కుటుంబానికి దగ్గరై వారిని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

    ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచాడు నటసింహం. సమరసింహారెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో గుండెకు హత్తుకునేలా నటించాడు.

    10 . ఆదిత్య 369(జూలై 18 , 1991)
    U|141 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ

    కృష్ణకుమార్ అనే యువకుడి పాత్రలో నటించాడు బాలకృష్ణ. టైం మిషన్‌తో భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్లినప్పుడు బాలకృష్ణ పరికించే హావభావాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే పనులు మానేసుకుని చూస్తారు.

    11 . భైరవ ద్వీపం(ఏప్రిల్ 14 , 1994)
    U|162 minutes|యాక్షన్,అడ్వెంచర్
    ఒక అబ్బాయిని అతని తల్లి అడవిలో పోగొట్టుకున్న తర్వాత ఒక గ్రామ ప్రధానాధికారి చేత పెంచబడతాడు. కాలం గడిచేకొద్దీ, అతను పెద్దవాడై ఒక రాజకుమారి ప్రేమలో పడతాడు. మంత్రగాడి మాయతో బాధపడుతున్న ఆమెను రక్షించాలని నిర్ణయించుకుంటాడు.

    ఇండస్ట్రీలో గ్లామర్ హీరోగా గుర్తింపు పొందుతున్న సమయంలో బాలకృష్ణ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. భైరవద్వీపం కథను ఎంచుకుని కురూపి(గూని)గా నటించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. యువకుడిగా, వృద్ధుడిగా మెప్పించాడు.


    @2021 KTree