• TFIDB EN
  • Editorial List
    Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?
    Dislike
    400+ views
    1 year ago

    నందమూరి నటసింహం బాలకృష్ణ- సిమ్రాన్‌కు తెలుగులో సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వీరి జోడికి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఉండేది. బాలయ్య- సిమ్రాన్ కాంబోలో ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఒక్క మగాడు(జనవరి 10 , 2008)
    A|178 minutes|డ్రామా
    రాము ఓ జంటకు పెళ్లి చేస్తాడు. పెళ్లి కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కావడంతో అతడి దృష్టి రాముపై పడుతుంది. మరోవైపు అచ్చం రాములాగే ఉండే వృద్ధుడు అవినీతి పరులను హత్య చేస్తుంటాడు. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరు? రాముకి అతడికి సంబంధం ఏంటి? సీఎం కుట్రలను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.

    'సీమ సింహం' సినిమా తర్వాత బాలకృష్ణతో సిమ్రాన్ చివరిసారిగా 'ఒక్క మగాడు' చిత్రంలో నటించింది. ఈ సినిమా బాలయ్య కేరిర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్ మూవీగా నిలిచింది. మొత్తంగా బాలయ్య, సిమ్రాన్ కలిసి ఐదు సినిమాల్లో జంటగా నటించారు. వీటిలో ఒక్కమగాడు మినహా మిగతా సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.

    2 . సీమ సింహం(జనవరి 11 , 2002)
    UA|155 minutes|యాక్షన్
    ఒకరి కొడుకు మరొకరి కారణంగా చంపబడిన తర్వాత ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారతారు. వారి శత్రుత్వం రెండు కుటుంబాల మధ్య చిచ్చునా రాజేస్తుంది.

    బాలకృష్ణ- సిమ్రాన్ కాంబోలో వచ్చిన నాల్గోవ చిత్రం సీమసింహం(2002). సీమసింహం చిత్రాన్ని జి.రామ్‌ప్రసాద్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్‌గా నిలిచింది.

    3 . నరసింహ నాయుడు(జనవరి 11 , 2001)
    A|161 minutes|యాక్షన్,డ్రామా
    రెండు ఊర్ల మధ్య ఫ్యాక్షన్ గొడవల వల్ల నరసింహనాయుడు భార్య చనిపోతుంది. దీంతో నరసింహనాయుడు తన బిడ్డను తీసుకుని దూరంగా వెళ్లి డ్యాన్స్ మాస్టర్‌గా జీవితం గడుపుతాడు. అయితే, శత్రువు కూతుర అయిన అంజలి అతన్ని ప్రేమించడంతో కథ మలుపు తిరుగుతుంది.

    బాలకృష్ణ- సిమ్రాన్ జోడిగా వచ్చిన హ్యాట్రిక్ చిత్రం నరసింహనాయుడు(2001). ఈ చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నరసింహనాయుడు అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని బి.గోపాల్ డైరెక్ట్ చేశారు.

    4 . గొప్పింటి అల్లుడు(జూలై 21 , 2000)
    U|160 minutes|డ్రామా
    మురళి ( బాలకృష్ణ) పారిశ్రామికవేత్త ఎస్వీఆర్ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కుమారుడు. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత స్టేట్స్ నుండి ఇండియా వస్తాడు. ఎస్వీఆర్ తన కోసం జిడ్డు బాలమణి (సాధిక) అనే అమ్మాయిని ఫిక్స్ చేసి ఆమెను పెళ్ళి చేసుకోమని కోరుతాడు. ఆ పెళ్ళి నుంచి బయటపడటానికి, మురళి తిరిగి స్విట్జర్లాండ్‌కు పారిపోతాడు. అక్కడ సౌమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు.

    సమరసింహారెడ్డి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి జోడి కుదరింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన 'గొప్పింటి అల్లుడు'(2000) చిత్రంలో బాలయ్య- సిమ్రాన్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది.

    5 . సమరసింహా రెడ్డి(జనవరి 13 , 1999)
    UA|148 minutes|యాక్షన్,డ్రామా
    సమరసింహారెడ్డి తన కుటుంబ హత్యకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అనుకోకుండా వాసు అనే అమాయకుడిని చంపేస్తాడు. ఓ అబద్దంతో వాసు కుటుంబానికి దగ్గరై వారిని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

    సిమ్రాన్- బాలకృష్ణ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం సమర సింహా రెడ్డి(1999). సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను బి.గోపాల్ తెరకెక్కించారు.


    @2021 KTree