2023 సంవత్సరంలో బెస్ట్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు!
3k+ views1 year ago
2023 ఏడాదిలో ఎన్ని సినిమాలు విడుదలైనప్పటికీ.. వాటిలో కామెడీ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైన సరే.. కొత్త ఏడాదిలోకి ఆనందంగా అడుగు పెట్టాలనుకుంటారు. అలాగే పాత ఏడాదికి సంతోషంగా విడ్కోలు చెప్పాలనుకుంటారు. మీకు సంతోషాన్ని పంచి కడుపుబ్బ నవ్వించే సినిమాల లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాం. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి మరి.Read More
1 . ఖుషి(సెప్టెంబర్ 01 , 2023)
UA|రొమాన్స్,డ్రామా,హాస్యం
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల మధ్య కొత్త సమస్యలు వస్తాయి. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ.
2 . టిల్లు స్క్వేర్(మార్చి 29 , 2024)
UA|హాస్యం,రొమాన్స్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
3 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
UA|హాస్యం,డ్రామా
క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
4 . OMG 2(ఆగస్టు 11 , 2023)
UA|హాస్యం,డ్రామా
ముగ్దల్ గొప్ప శివ భక్తుడు. ఓ రోజు అతడి కొడుకు వివేక్ అసభ్య ప్రవర్తన వల్ల స్కూల్ నుంచి డిస్మిస్ అవుతాడు. టాయిలెట్‌లో కొడుకు చేసిన పని నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ముగ్దల్ ఊరి వదిలి వెళ్లాలని భావిస్తాడు. ఈ క్రమంలో దేవదూత ప్రత్యక్షమై కొడుకు చేసిన పనిపై భయపడకుండా పోరాటం చేయమంటాడు. ఆ మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అందుకు ఎంచుకున్న మార్గం ఏంటి? అన్నది కథ.
5 . మ్యాడ్(అక్టోబర్ 06 , 2023)
UA|హాస్యం,డ్రామా
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్, అశోక్, దామోదర్ తమ ప్రేమను గెలిపించుకున్నారా? అనేది మిగతా కథ.
6 . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(సెప్టెంబర్ 07 , 2023)
UA|హాస్యం,రొమాన్స్
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
7 . కీడా కోలా(నవంబర్ 03 , 2023)
UA|హాస్యం,క్రైమ్
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
8 . మెమ్ ఫేమస్(మే 26 , 2023)
UA|హాస్యం,డ్రామా
తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్ ప్రభాస్), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి తన మరదలు మౌనిక (సార్య లక్ష్మణ్)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. అయితే జులాయిగా తిరిగే వీరంతా కలిసి ఓ టెంట్ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్ సర్య్కూట్‌కి టెంట్ హౌజ్ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? అనేది మిగతా కథ.
9 . డెడ్‌పూల్ & వుల్వరైన్(జూలై 26 , 2024)
A|యాక్షన్,హాస్యం,డ్రామా
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ - వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి? అన్నది స్టోరీ.
10 . ప్రేమలు(మార్చి 08 , 2024)
U|హాస్యం,రొమాన్స్
సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
11 . వినరో భాగ్యము విష్ణు కథ(ఫిబ్రవరి 18 , 2023)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
దర్శన (కాశ్మీరా పరదేశి), ఒక యూట్యూబర్, ఆమె ఫోన్ నంబర్‌లో లాస్ట్ నెంబర్‌కు తర్వాత ఉన్న విష్ణు (కిరణ్ అబ్బవరం)తో అనుకోకుండా ఓ రోజు ఫోన్ కలుస్తుంది. వీరి పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారుతుంది. మరోవైపు మురళి శర్మతో ఇదే తరహా ఫొన్ పరిచయం ఏర్పడుతుంది. దర్శన తన యూట్యూబ్ ఛానెల్‌ని మరింత విస్తరించేందుకు విష్ణు, శర్మ సాయం చేస్తారు. అయితే ఓ రోజు శర్మను దర్శన కాల్చి చంపుతుంది? అసలు శర్మను దర్శన ఎందుకు కాల్చి చంపుతుంది అన్నది మిగతా కథ.
12 . సామజవరగమన(జూన్ 29 , 2023)
U|హాస్యం,డ్రామా
బాలు (శ్రీవిష్ణు) హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో టిక్కెట్లు అమ్ముతుంటాడు. కానీ అతని తండ్రి (నరేష్) డిగ్రీ పూర్తి చేయాలని సూచిస్తాడు. ఓ రోజు డిగ్రీ పరీక్ష హాలులో సరయు (రెబా మోనికా జాన్)ని బాలు కలుస్తాడు. ఆ తర్వాత సరయు ఇంటికి పేయింగ్ గెస్ట్‌గా వెళ్లి బాలు ఆమెతో ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో సరయు కుటుంబం గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఆ సమస్యను బాలు ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ
13 . ఫాలిమి (నవంబర్ 17 , 2023)
U|హాస్యం,డ్రామా,ఫ్యామిలీ
ఒక ఫ్యామిలీ తమ కుటుంబ పెద్ద కోరికను తీర్చేందుకు తీర్థయాత్రకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో వారికి అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది? అన్నది కథ.
14 . మెకానిక్ రాకీ(నవంబర్ 22 , 2024)
UA|యాక్షన్,హాస్యం,డ్రామా
రాకీ (విష్వక్ సేన్) తండ్రి నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేస్తూ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతడి వద్ద డ్రైవింగ్ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? రాంకీ రెడ్డి (సునీల్) వల్ల రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? అన్నది స్టోరీ.
15 . ఫ్యామిలీ ప్యాక్(అక్టోబర్ 23 , 2024)
UA|అడ్వెంచర్,హాస్యం,ఫాంటసీ
ఓ కుటుంబంలోని సభ్యులు పాతకాలం నాటి ఓ కార్డ్ గేమ్ ఆడతారు. గేమ్ వల్ల అనుకోకుండా మధ్యయుగం నాటి కాలానికి వెళ్లిపోతారు. అక్కడ తోడేళ్ల నుంచి వారికి సవాళ్లు ఎదురవుతాయి. వాటితో వారు ఎలా పోరాడారు? ప్రస్తుత కాలానికి వారు రాగలిగారా? లేదా? అన్నది స్టోరీ.