Editorial List
బ్రహ్మానందం నటించిన చిత్రాల్లో టాప్ 20 బెస్ట్ సినిమాలు
300+ views8 months ago
తెలుగులో హాస్య బ్రహ్మగా బ్రహ్మానందం గుర్తింపు పొందారు. ప్రస్తుతం జీవించి ఉన్న నటుల్లో అత్యధిక సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్‌గా ఆయన గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించారు. హాస్యం పండించడంతో బ్రహ్మానందంది ప్రత్యేక శైలీ. ఆయన నటించిన చిత్రాల్లో బెస్ట్ చిత్రాలను ఎంపిక చేయడం కష్టమే అయినా కొన్ని బెస్ట్ చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
1 . వివాహ భోజనంబు(ఏప్రిల్ 27 , 1988)
U|142 mins|హాస్యం
లావణ్య భావాలను తప్పుగా అర్థం చేసుకున్న సీతారామకు స్త్రీలపై ద్వేషం ఏర్పడుతుంది. అయినప్పటికీ, ఆమె అతని అపోహలను తొలగించి అతనిని గెలవడానికి ప్రయత్నిస్తుంది.
2 . అదుర్స్(జనవరి 13 , 2010)
UA|150 minutes|యాక్షన్,రొమాన్స్
పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవల సోదరులు వేర్వేరు పరిస్థితుల్లో పెరుగుతారు. ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి తమ తండ్రిని కాపాడుకునేందుకు ఇద్దరు ఏకమవుతారు.
3 . దూకుడు(సెప్టెంబర్ 23 , 2011)
UA|175 minutes|యాక్షన్,డ్రామా
మాజీ ఎమ్మెల్యే శంకర్ కోమాలోకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. డాక్టర్లు ఆయనకు షాకింగ్ విషయాలు చెప్పవద్దని చెప్తారు. దీంతో పోలీసాఫీసర్ అయిన అజయ్ తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు యత్నిస్తాడు. అదే సమయంలో తండ్రికి అన్యాయం చేసిన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అన్నది కథ.
4 . రెడీ(జూన్ 19 , 2008)
UA|175 minutes|హాస్యం,రొమాన్స్
హీరో అనుకోకుండా హీరోయిన్ పెళ్లి చెడగొడతాడు. అయితే హీరోయిన్‌కు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విలన్ల నుంచి హీరోయిన్‌కు పొంచి ఉన్న ముప్పు ఏంటి? అన్నది కథ.
5 . యమదొంగ(ఆగస్టు 15 , 2007)
U|179 minutes|డ్రామా,ఫాంటసీ
రాజా ఒక అనాథ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఓ ధనవంతుడి మనవరాలు మహిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసే క్రమంలో మరణిస్తాడు. అతను యమలోకానికి వెళ్లి యమదేవుడితో తన జీవితాన్ని తిరిగిపొందేందుకు అతనితో పోరాడుతాడు.
6 . ఎవడి గోల వాడిది(జనవరి 21 , 2005)
UA|హాస్యం
శంకర్ ఆర్తిని ప్రేమిస్తాడు. కానీ అతని వివాహం శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ బక్కా రెడ్డి కుమార్తెతో నిర్ణయించబడుతుంది. శంకర్ ఉద్దేశం తెలుసుకున్న బక్కా రెడ్డి.. ఆర్తిని చంపమని తన మనుషులను ఆదేశిస్తాడు.
7 . పోకిరి(ఏప్రిల్ 27 , 2006)
A|168 minutes|యాక్షన్,థ్రిల్లర్
పండు డబ్బు కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడే యువకుడు. కొన్ని కారణాల వల్ల అతను మాఫియా డాన్ అలీ భాయ్‌కి శత్రువు అవుతాడు. తర్వాత ఏమి ఏం జరిగింది? పండుకి ఉన్న గతం ఏంటి? అన్నది కథ.
8 . లౌక్యం(సెప్టెంబర్ 26 , 2014)
UA|149 minutes|హాస్యం,డ్రామా
హీరో తన ఫ్రెండ్ కోసం విలన్ చెల్లెల్ని కిడ్నాప్ చేసి వారికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత విలన్ నుంచి తప్పించుకొని నగరానికి వచ్చిన హీరో అక్కడ తొలిచూపులోనే హీరోయిన్‌ను ప్రేమిస్తారు. తీరా ఆమె విలన్ రెండో చెల్లెలు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
9 . బద్రి(ఏప్రిల్ 20 , 2000)
U|158 minutes|రొమాన్స్
బద్రి, వెన్నెల ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. బద్రి తనను స్వచ్ఛంగా ప్రేమించడం లేదని వెన్నెల ఆరోపిస్తుంది. తనలాగా బద్రిని ఎవరూ ప్రేమించరు అని సవాలు విసురుతుంది. అయితే సరయు అనే యువతి బద్రి జీవితంలోకి రావడంతో కథ మలుపు తిరుగుతుంది.
10 . విక్రమార్కుడు(జూన్ 23 , 2006)
UA|161 minutes|యాక్షన్,హాస్యం
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాథోడ్‌ను పోలి ఉండే సత్తిబాబు, అతని మరణం తర్వాత అతని కుమార్తెను దత్తత తీసుకుంటాడు. రాథోడ్ స్థానంలో పోలీసు అధికారిగా వెళ్లి దుష్ట బావూజీ దోపిడీలను అంతం చేస్తాడు.
11 . దుబాయ్ శీను(జూన్ 08 , 2007)
U|హాస్యం
దుబాయ్ వెళ్లి స్థిరపడాలని భావించిన శీను ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఫ్రెండ్స్‌తో పాటు ముంబైలో కాలం వెళ్లదీస్తుంటాడు. ఈక్రమంలో మధుమతి అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు. ఒక భయంకరమైన డాన్ తన స్నేహితుడిని, మధుమతి సోదరుడిని చంపాడని తెలుసుకుని అతనిపై ప్రతీకారానికి బయల్దేరుతాడు.
12 . వెంకీ(మార్చి 26 , 2004)
U|170 minutes|హాస్యం,మిస్టరీ,రొమాన్స్
వెంకటేశ్వర్లు పోలీస్ ఫోర్స్‌లో తన స్నేహితులతో కలిసి రైలులో హైదరాబాద్‌కు బయల్దేరుతాడు. కానీ రైలులో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య వెంకీ అనతి స్నేహితులపై పడుతుంది. అయితే వీరంతా శిక్షణ కోసం అకాడమీలో చేరినప్పుడు.. రైలులో జరిగిన హత్యకు కారణం తెలుసుకుంటారు.
13 . ఢీ(ఏప్రిల్ 13 , 2007)
U|హాస్యం
హీరో ఓ గ్యాంగ్‌స్టర్ దగ్గర పనిలోకి చేరతాడు. అక్కడ ఆమె చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చోటుచేసుకున్న హాస్య అన్నది కథ.
14 . పెదరాయుడు(జూన్ 15 , 1995)
UA|164 minutes|డ్రామా
పెదరాయుడు గ్రామపెద్ద. వంశపారంపర్యంగా వచ్చిన సింహాసనంపై కూర్చుని గ్రామంలోని సమస్యలపై తీర్పులు ఇస్తాడు. ఓ టీచర్ ఆత్మహత్య తమ్ముడు రాజా మెడకు చుట్టుకుంటుంది. దీంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
15 . క్షేమంగా వెళ్లి లాభంగా రండి(ఫిబ్రవరి 04 , 2000)
U|172 minutes|హాస్యం
రవి, రాంబాబు, జంబులింగం ఓ కార్ కంపెనీలో మెకానిక్‌లుగా పనిచేస్తుంటారు. పెళ్లాల మాట వినకుండా దుబారాగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమ అవసరాల కోసం ఆ కంపెనీ ప్యూన్ బెజవాడ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేస్తారు. మరోవైపు ఉద్యోగాలు పొగొట్టుకుంటారు.
16 . ఆంధ్రావాలా(జనవరి 02 , 2004)
UA|154 minutes|యాక్షన్,డ్రామా
కార్మిక సంఘం నాయకుడు శంకర్‌ను మాఫియా డాన్ చంపేశాడు. మురికివాడల్లో నివసించే అతని కొడుకు మున్నాకి తన గతం తెలియదు. అయితే, అతని శత్రువులు అతన్ని గుర్తించి చంపడానికి ప్రయత్నిస్తారు.
17 . పెళ్లి సందడి(జనవరి 12 , 1996)
U|129 minutes|మ్యూజికల్,రొమాన్స్
శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
18 . సాహస వీరుడు సాగర కన్య(ఫిబ్రవరి 09 , 1996)
UA|139 minutes|డ్రామా,ఫాంటసీ
ఒక మత్స్యకన్య తన శరీరాన్ని కోల్పోయి రవిచంద్ర వద్దకు చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న నిధి కోసం ఓ మంత్రగత్తె ఆ మత్స్యకన్యను ఇబ్బందులకు గురిచేస్తుంది. అప్పుడు రవి ఏం చేశాడు? మత్స్యకన్యను ఎలా కాపాడాడు? అన్నది కథ.
19 . అల్లుడా మజాకా(ఫిబ్రవరి 25 , 1995)
A|యాక్షన్,డ్రామా
ధనవంతుడు కొడుకు అయిన సీతారం సంపదను శత్రువులు దోచుకుంటారు. అన్యాయంగా అతడ్ని హత్య కేసులో ఇరికించి జైలుకు పంపుతారు. జైలు నుంచి బయటకొచ్చిన సీతారాం ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
20 . ముగ్గురు మొనగాళ్ళు(ఆగస్టు 06 , 2021)
UA|120 minutes|హాస్యం,థ్రిల్లర్
హైదరాబాద్‌లో వరుసగా రాజకీయ నేతల హత్యలు జరుగుతుంటాయి. పోలీసులతో కలిసి అంధత్వం, చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు యువకులు హంతకులను ఎలా పట్టుకున్నారన్నది కథ.